AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat Sleeper: వందే భారత్ స్లీపర్ రైళ్లలో ఈ టికెట్లు అసలు ఉండవ్.. బుకింగ్ కూడా కుదరదు.. రిజర్వేషన్ రూల్స్ ఇవే..

వందే భారత్ స్లీపర్ రైళ్లను దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టేందుకు రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది. విడతల వారీగా అన్ని ప్రాంతాలకు విస్తరించనుంది. అయితే వందే భారత్ రైళ్లలో కొన్ని ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. టికెట్ బుకింగ్ నిబంధనలు సాధారణ రైళ్ల తరహాలోనే ఉండవు. ఈ రూల్స్ గురించి తెలుసుకుందాం.

Vande Bharat Sleeper: వందే భారత్ స్లీపర్ రైళ్లలో ఈ టికెట్లు అసలు ఉండవ్.. బుకింగ్ కూడా కుదరదు.. రిజర్వేషన్ రూల్స్ ఇవే..
Vande Bharat Sleeper
Venkatrao Lella
|

Updated on: Nov 07, 2026 | 1:33 PM

Share

దేశవ్యాప్తంగా వందే భారత్ స్లీపర్ రైళ్లు విడతల వారీగా అందుబాటులోకి వస్తున్నాయి. ఒక్కొక్కటిగా వీటిని రైల్వేశాఖ ప్రవేశపెడుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా మూడు వందే భారత్ స్లీపర్ ట్రైన్లు అందుబాటులోకి వచ్చాయి. హౌరా-గువహతి, ఢిల్లీ-వారణాసి, ముంబై-బెంగళూరు మధ్య ఇప్పటికే తిప్పుతుండగా.. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా అన్ని రూట్లలో నడిచే అవకాశముంది. అయితే ఇతర రైళ్లతో పోలిస్తే వందే భారత్ స్లీపర్ రైళ్లల్లో అనేక సదుపాయాలు ఉంటాయి. విమానాన్ని తలపించేలా అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. దీంతో ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా హాయిగా ప్రయాణించవచ్చు. రాత్రిపూట ప్రయాణాల కోసం వీటిని తీసుకొచ్చారు. దీంతో రాత్రిపూట హాయిగా నిద్రపోతూ గమ్యస్థానానికి చేరుకోవచ్చు.

వందే భారత్ స్లీపర్ టికెట్ రూల్స్..

ఇతర రైళ్లతో పోలిస్తే వందే భారత్ స్లీపర్ ట్రైన్లలో టికెట్ రూల్స్ వేరుగా ఉంటాయి. సాధారణంగా అన్ని రైళ్లల్లో తత్కాల్ టికెట్ల బుకింగ్ ముందు రోజు విడుదల చేస్తారు. కానీ వందే భారత్ స్లీపర్ రైళ్లకు తత్కాల్ టికెట్ల సదుపాయం ఉండదు. అలాగే డైనమిక్ ఫేర్, ఫ్లెక్సీ ఫేర్ విధానం కూడా వర్తించదు. దీని వల్ల రద్దీ సమయాల్లో టికెట్ల ధరలను పెంచడం, బుకింగ్స్‌ను బట్టి చివరి నిమిషాల్లో అధిక ధరలను పెంచడం లాంటివి ఉండవు. టికెట్ రేట్లు ఫిక్స్‌డ్‌గా ఉంటాయి. సాధారణ రిజర్వేషన్ ప్రక్రియ ద్వారానే టికెట్ల బుకింగ్ జరుగుతుంది.

వీరి కోసం ప్రత్యేక కోటా

వందే భారత్ స్లీపర్ రైళ్లలో 16 కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. వీటిల్లో మొత్తం 823 బెర్త్‌లు ఉంటాయి. 611 ఏసీ థర్డ్ టైర్ బెర్త్‌లు, 188 సెకండ్ టైర్ బెర్త్‌లు, 24 ఫస్ట్ ఏసీ బెర్త్‌లు ఉంటాయి. ఇక మహిళల భద్రత, రైలు ఉద్యోగుల కోసం బెర్త్‌ల కేటాయింపుల్లో ప్రత్యేక కోటా ఉంది. థర్డ్ ఏసీలో మహిళల సౌకర్యం కోసం ఆరు బెర్త్‌లను ప్రత్యేకంగా కేటాయిస్తారు. డ్యూటీ పాస్‌లు కలిగిన రైల్వే ఉద్యోగుల కోసం 21 బెర్త్‌లు రిజర్వ్ చేసి ఉంటాయి. ఈ వర్గాల కోసం ప్రత్యేక బెర్తుల కోటా ఉంటుంది. భవిష్యత్తులో అన్ని ప్రాంతాలను కవర్ చేసేలా వందే భారత్ స్లీపర్ రైళ్లు ప్రవేశపెట్టనున్న క్రమంలో వాటిల్లో ప్రయాణం చేయాలనుకునేవారు ఈ నిబంధనల గురించి తెలుసుకోవడం ముఖ్యం. ఇక ఈ రైళ్లల్లో ఫుడ్ కూడా అందిస్తారు. టికెట్ ఛార్జీల్లోనే ఈ ఛార్జీలు కవర్ అయి ఉంటాయి. లంచ్, డిన్నర్, టిఫిన్ వంటి సౌకర్యాలు ఉంటాయి. ఇక ప్రత్యేకంగా కావాలనుకుంటే ఆహార పదార్ధాలను కొనుగోలు చేయవచ్చు. ఇక టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీలు సాధారణ రైళ్ల తరహాలోనే ఉంటాయి.

Follow Us
వందే భారత్ స్లీపర్ టికెట్ రూల్స్ ఇవే.. ఆ టికెట్లు ఉండవ్..
వందే భారత్ స్లీపర్ టికెట్ రూల్స్ ఇవే.. ఆ టికెట్లు ఉండవ్..
దీపావళి రోజు ఎప్పుడు దీపాలు వెలిగించాలి? లక్ష్మీదేవి పూజా విధానం
దీపావళి రోజు ఎప్పుడు దీపాలు వెలిగించాలి? లక్ష్మీదేవి పూజా విధానం
కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెడగొట్టినట్టు.. సామెత అర్థం తెలుసా
కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెడగొట్టినట్టు.. సామెత అర్థం తెలుసా
ఆ వీడియోస్ షేర్ చేయకండి.. సురేఖ వాణి ఫైర్..
ఆ వీడియోస్ షేర్ చేయకండి.. సురేఖ వాణి ఫైర్..
IND vs PAK: ఆసియా కప్‌లో రేపు హై వోల్టేజ్ మ్యాచ్!
IND vs PAK: ఆసియా కప్‌లో రేపు హై వోల్టేజ్ మ్యాచ్!
దీపావళి స్పెషల్ విషెస్.. మీ సన్నిహితుల మనసు గెలుచుకునే అద్భుతమైన
దీపావళి స్పెషల్ విషెస్.. మీ సన్నిహితుల మనసు గెలుచుకునే అద్భుతమైన
నేనెప్పుడు బాగుండాలని కోరుకునే నిజమైన స్నేహితుడు అతడే..
నేనెప్పుడు బాగుండాలని కోరుకునే నిజమైన స్నేహితుడు అతడే..
ధోనీని మాహి చాచు అని పిలుస్తా.. నటి ఆసక్తికర వ్యాఖ్యలు!
ధోనీని మాహి చాచు అని పిలుస్తా.. నటి ఆసక్తికర వ్యాఖ్యలు!
పరిషత్ పోరులో కూటమి దూకుడు.. ఇప్పటి వరకు గెలిచిన స్థానాలు ఇవే!
పరిషత్ పోరులో కూటమి దూకుడు.. ఇప్పటి వరకు గెలిచిన స్థానాలు ఇవే!
బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.. బెల్లం పొంగడాలు తయారీ విధానం ఇదిగో!
బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.. బెల్లం పొంగడాలు తయారీ విధానం ఇదిగో!