Credit Card: తక్కువ వడ్డీకి క్రెడిట్ కార్డు బిల్లును ఇలా చెల్లించండి.. భారం నుంచి ఇలా బయటపడండి..

Credit Card: క్రెడిట్ కార్డ్ బిల్లు లక్షల్లో, లేదా చాలా ఎక్కువగా ఉందా ? దానిని తక్కువ వడ్డీకి లేదా సున్న వడ్డీతో ఎలా చెల్లించాలి అని ఆలోచిస్తున్నారా. ఇందుకు ఉన్న మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Credit Card: తక్కువ వడ్డీకి క్రెడిట్ కార్డు బిల్లును ఇలా చెల్లించండి.. భారం నుంచి ఇలా బయటపడండి..
Credit Card
Follow us

|

Updated on: Apr 15, 2022 | 8:03 PM

Credit Card: క్రెడిట్ కార్డ్ బిల్లు లక్షల్లో, లేదా చాలా ఎక్కువగా ఉందా ? దానిని తక్కువ వడ్డీకి లేదా సున్న వడ్డీతో ఎలా చెల్లించాలి అని ఆలోచిస్తున్నారా. ఇందుకు ఉన్న మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. క్రెడిట్ కార్డ్ చెల్లింపు, వార్షిక వడ్డీ, గడువు తేదీ, బిల్లింగ్ సైకిల్, బ్యాలెన్స్ బదిలీ , క్రెడిట్ కార్డ్ ఖర్చు లక్షల్లో ఉంటే.. వాటి నుంచి వెంటనే బయట పడటం చాలా ముఖ్యం. తరువాత కట్టేదాం అనే ఆలోచనతో చాలా మంది క్రెడిట్ కార్డ్ హోల్డర్లు విపరీతంగా ఖర్చు చేస్తుంటారు. బడ్జెట్ గురించి ఆలోచించకుండా వ్యవహరిస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరమైన అలవాటు. కొంత చెల్లించి మిగిలినది తరువాతి నెలలో చెల్లించాలని అనుకుంటుంటారు. దీని వల్ల చెల్లించాాల్సిన మెుత్తానికి భారీగా వడ్డీ, పెనాల్టీలను సదరు సంస్థ వినియోగదారుల నుంచి వసూలు చేసే ప్రమాదం ఉంటుంది. క్రెడిట్ కార్డ్‌లపై వార్షిక వడ్డీ సంవత్సరానికి 36-48 శాతం వరకు ఉంటుంది.

క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌ రాగానే.. మొత్తం బకాయిలను సకాలంలో చెల్లించాలని నిర్ధారించుకోండి. స్టేట్‌మెంట్ తేదీ నుండి బకాయి మొత్తాన్ని చెల్లించడానికి కొన్ని రోజుల సమయం లభిస్తుంది. మొత్తంగా కొనుగోలు తేదీని బట్టి దాదాపు 45-51 రోజుల వడ్డీరహిత వ్యవధి ఉంటుంది. ఐదు శాతం మాత్రమే చెల్లించి, తదుపరి బిల్లింగ్ సైకిల్‌కు బకాయిలను రోల్ ఓవర్ చేసే అవకాశముంటుంది. వడ్డీ చెల్లింపులు చేయకుండా ఉండాలనుకుంటే బకాయిలను ఎప్పటికీ రోల్ చేయవద్దు.

తదుపరి బిల్లింగ్ సైకిల్‌కు బకాయి ఉన్న బ్యాలెన్స్‌పై రోలింగ్ 3-4 శాతం చొప్పున నెలవారీ వడ్డీ ఉంటుంది. ప్రతి నెలా కొత్త కొనుగోళ్లను కొనసాగిస్తూ ఉంటే వడ్డీ భారం పెరుగుతుంది. క్రెడిట్ కార్డ్ బిల్లులను పూర్తిగా చెల్లించే ఆర్థిక స్థితి లేనప్పుడు ‘బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్(బీటీ)’ సదుపాయాన్ని ఎంచుకోవచ్చు. బీటీ కింద బకాయి ఉన్న మొత్తాన్ని తక్కువ వడ్డీ రేటుతో మరొక క్రెడిట్ కార్డ్‌కు  బదిలీ చేసుకోవచ్చు. అంతే కాకుండా తద్వారా వడ్డీ ఖర్చులపై ఆదా చేయవచ్చు. నెలకు దాదాపు 3.5 శాతం చెల్లించే బదులు, బీటీ చేయటం వల్ల కేవలం 1 నుంచి 1.77 శాతం వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది.

మరో పద్ధతి ఏమిటంటే.. చెల్లించాల్సిన డ్యూ మెుత్తాన్ని ఈఎంఐగా మార్చుకోవచ్చు. మార్పిడి తర్వాత.. వడ్డీ హిట్ కార్డ్‌పై ఉన్నదాని కంటే దాదాపు 14-24 శాతం తక్కువగా ఉండే అవకాశముంటుంది. రెండు రకాల ఈఎంఐ మార్పిడి సౌకర్యాలు ఉంటాయి. మొదటిది క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి నిర్దిష్ట ఉత్పత్తిని కొనుగోలు చేసినప్పుడు వ్యాపారి అందించే ఈఎంఐలు. ప్రత్యామ్నాయంగా, క్రెడిట్ కార్డ్ జారీచేసేవారు సదరు క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి చేసిన కొన్ని అధిక-టిక్కెట్ కొనుగోళ్లపై ఈఎంఐ ఎంపికను అందించవచ్చు. నగదు ఉపసంహరణలను నివారించండి.. క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించి ఏటీఎంల నుండి నగదును విత్‌డ్రా చేయవలసి వస్తే, ఈ విత్‌డ్రాలకు వడ్డీరహిత వ్యవధి ఉండదు కాబట్టి వీలైనంత త్వరగా క్యాష్ బ్యాక్ డిపాజిట్ చేయాలని గుర్తుంచుకోండి. ఇలా సకాలంలో స్పందించటం ద్వారా వడ్డీల భారం నుంచి క్రెడిట్ కార్డు వినియోగదారులు తప్పించుకోవచ్చు.

ఇవీ చదవండి..