US Fed Rate Hike: మరోసారి వడ్డీ రేట్లు పెంచిన అమెరికా ఫెడరల్‌ రిజర్వ్.. 0.75 బేసిస్ పాయింట్లు పెంపు..

|

Jun 16, 2022 | 7:36 AM

అమెరికాలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. US ఫెడరల్ రిజర్వ్ జూన్ 15, 2022 న 75 బేసిస్ పాయింట్ల వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది...

US Fed Rate Hike: మరోసారి వడ్డీ రేట్లు పెంచిన అమెరికా ఫెడరల్‌ రిజర్వ్.. 0.75 బేసిస్ పాయింట్లు పెంపు..
Fed
Follow us on

అమెరికాలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. US ఫెడరల్ రిజర్వ్ జూన్ 15, 2022 న 75 బేసిస్ పాయింట్ల వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఫెడ్ నిర్ణయం తర్వాత వడ్డీ రేట్లు 1.75 శాతానికి పెరిగాయి. 28 ఏళ్లలో ఇదే అతిపెద్ద పెరుగుదల. 75 bps పెరుగుదల 1994 తర్వాత అత్యధికం. పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి చెక్ పెట్టేందుకు ఫెడ్‌ ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికాలో ద్రవ్యోల్బణం ఇప్పటికే 40 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. మే నెలలో అమెరికాలో ద్రవ్యోల్బణం 8.6 శాతంగా ఉంది. ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ వడ్డీ రేట్ల పెంపుపై సూచనప్రాయంగా వెల్లడించారు. ఫెడ్ జూలైలో మళ్లీ 0.75 రేట్లు పెంచవచ్చని తెలిపారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలోకి తీసుకురావడానికి ఫెడ్‌కి ఇది అవసరమని కూడా ఆయన అన్నారు. US ఫెడరల్ రిజర్వ్ 2022 కోసం దాని వృద్ధి అంచనాను మార్చిలో 2.8% నుంచి 1.7 శాతానికి తగ్గించింది. ఫెడ్‌ నిర్ణయాల తర్వాత గ్లోబల్‌ మార్కెట్‌లో బూమ్‌ నెలకొంది. డౌ జోన్స్ దాదాపు 300 పాయింట్లు, నాస్‌డాక్ 2.5 శాతం పెరిగాయి. ఆసియా మార్కెట్లు బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. SGX నిఫ్టీ దాదాపు 180 పాయింట్ల లాభంతో 15,850 దగ్గర ప్రారంభమైంది.

యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెరుగుదల కారణంగా, భారతీయ కరెన్సీ సంక్షోభంలో దూసుకెళ్లడం ప్రారంభించింది. ఫెడ్ ఈ నిర్ణయం డాలర్‌ను బలోపేతం చేస్తుంది. ఇది రూపాయి విలువను మరింత దిగజార్చవచ్చు. ఇప్పటికే రూపాయి 78 దాటింది. అటువంటి పరిస్థితిలో, రూపాయి మరింత క్షీణతను చూడవచ్చు. బుధవారం రూపాయి వరుసగా నాలుగో ట్రేడింగ్ సెషన్‌లో రికార్డు స్థాయిలో ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 18 పైసలు క్షీణించి డాలర్‌తో పోలిస్తే 78.22 వద్ద ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరుకుంది. ఫెడ్ నిర్ణయం వల్ల డాలర్ బలపడితే బంగారం బలహీనంగా ఉంటుంది. దీని ప్రభావం భారత మార్కెట్లపై కూడా కనిపించనుంది. బంగారం ధరలు తగ్గునున్నాయి. బుధవారం ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.3 పెరిగి రూ.50,304కి చేరుకుంది. ఫెడ్ రేటు పెరుగుదల తర్వాత, విదేశీ పెట్టుబడిదారులు భారతీయ స్టాక్ మార్కెట్లో విక్రయించవచ్చు. అటువంటి పరిస్థితిలో, మార్కెట్లో పెద్ద పతనం ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.