
భారత ఆర్థిక వ్యవస్థ రూపురేఖలను సమూలంగా మార్చేసిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) అందుబాటులోకి వచ్చి నేటికి సరిగ్గా పదేళ్లు పూర్తయింది. ఒకప్పుడు జేబులో నోట్లు లేనిదే బయటకు రాలేని పరిస్థితి నుంచి, నేడు చేతిలో పైసా పట్టుకోకుండా దేశ విదేశాలు తిరిగే స్థాయికి డిజిటల్ విప్లవం చేరుకుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అభివృద్ధి చేసిన ఈ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ పదేళ్ల కాలంలో అద్భుతమైన ప్రగతిని సాధించి, దేశ ప్రజల నిత్య జీవితంలో అంతర్భాగంగా మారింది.
యూపీఐ ప్రస్థానంలో కీలక మైలురాళ్లు
2016లో కేవలం 21 బ్యాంకులతో ప్రారంభమైన యూపీఐ, భీమ్ (BHIM) యాప్‌తో సేవలు 2018 నాటికి డైనమిక్ క్యూఆర్ కోడ్స్, ఇన్‌వాయిస్ ఇన్ ది ఇన్‌బాక్స్, యూపీఐ మ్యాండేట్స్ వంటి ఫీచర్లతో వినియోగదారుల్లో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. దీంతో ప్రభుత్వం యూపీఐ 2.0ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
వినియోగదారుల నుంచి వచ్చిన రెస్పాన్స్‌తో 2019లో ఐపీవో (IPO) దరఖాస్తులకు కూడా యూపీఐ అనుమతి లభించింది. ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం యూపీఐ 123PAY, చిన్న మొత్తాల చెల్లింపుల కోసం పిన్ అవసరం లేని ‘యూపీఐ లైట్ (UPI Lite)’, రికరింగ్ చెల్లింపులకు ఆటోపే (AutoPay) తదితర సేవలను అందుబాటులోకి తెచ్చింది.
2023–2025లో క్రెడిట్ లైన్ లింకింగ్, యూపీఐ సర్కిల్ (ప్రైమరీ యూజర్ అనుమతితో ఇతరులు లావాదేవీలు చేయడం), పన్ను చెల్లింపుల పరిమితి రూ.5 లక్షల వరకు పెంపు, అలాగే సురక్షితమైన ఆన్-డివైస్ బయోమెట్రిక్ , ఫేస్ అథెంటికేషన్ ద్వారా పిన్ ఆన్‌బోర్డింగ్ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి.
రికార్డు స్థాయి లావాదేవీలు
స్టార్టింగ్ స్టేజ్‌లో 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ. 2 కోట్లుగా ఉన్న లావాదేవీలు, 2025-26 నాటికి 24,162 కోట్లకు పైగా పెరిగాయి అంటే కేవలం 10 ఏళ్లలోనే యూపీఐ లావాదేవీలు 12,000 రెట్ల పెరిగాయి. అలాగే యూపీఐ వార్షిక లావాదేవీల విలువ రూ.0.07 లక్షల కోట్ల నుంచి దాదాపు రూ.314 లక్షల కోట్లకు చేరింది చేరింది. అంటే దాదాపు 4,000 రెట్ల వృద్ధి చెందింది. ప్రస్తుతం జూలై 2026 నాటికి దేశవ్యాప్తంగా యూపీఐ పరిధిలో 741 బ్యాంకులు ఉండగా, ఒక్క నెలలోనే రూ. 29.87 లక్షల కోట్ల విలువైన 2,365.8 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి.
అంతర్జాతీయ స్థాయిలో విస్తరణ
ప్రపంచవ్యాప్తంగా జరిగే రియల్-టైమ్ డిజిటల్ లావాదేవీల్లో యూపీఐ వాటా సుమారు 49 శాతానికి చేరిందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) పేర్కొంది. యూపీఐ సేవలు భారత్‌లోనే కాకుండా భూటాన్, నేపాల్, సింగపూర్, యూఏఈ, ఫ్రాన్స్, శ్రీలంక, మారిషస్, ఖతార్, కంబోడియా, గ్రీస్, మాల్దీవులు సహా మొత్తం 11 విదేశాలకు విస్తరించాయిని.. దీంతో సరిహద్దు నిధుల బదిలీల కూడా చాలా సులభతరం అయిందని తెలిపింది. భారత డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో యూపీఐ ఒక కీలక స్తంభంగా నిలిచి, ప్రపంచానికే ఆదర్శంగా మారింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,