UPI Transactions: యూపీఐ వినియోగదారులకు గుడ్‌ న్యూస్.. ఇకపై రూ.5 లక్షల వరకు లావాదేవీలు..

| Edited By: Shaik Madar Saheb

Sep 17, 2024 | 7:45 PM

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ లావాదేవీల కోసం ఆన్‌లైన్ ప్రక్రియను అవలంభిస్తున్నారు. దీని ద్వారా, ఎప్పుడైనా, ఎక్కడైనా ఇంట్లో కూర్చొని డబ్బు లావాదేవీలు సులభంగా చేసుకోవచ్చు. దీన్ని మరింత సౌకర్యవంతంగా చేయడానికి UPI (Unified Payments Interface) అందుబాటులో ఉంది.

UPI Transactions: యూపీఐ వినియోగదారులకు గుడ్‌ న్యూస్.. ఇకపై రూ.5 లక్షల వరకు లావాదేవీలు..
Upi Transactions
Follow us on

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ లావాదేవీల కోసం ఆన్‌లైన్ ప్రక్రియను అవలంభిస్తున్నారు. దీని ద్వారా, ఎప్పుడైనా, ఎక్కడైనా ఇంట్లో కూర్చొని డబ్బు లావాదేవీలు సులభంగా చేసుకోవచ్చు. దీన్ని మరింత సౌకర్యవంతంగా చేయడానికి UPI (Unified Payments Interface) అందుబాటులో ఉంది. దీనిని అన్ని డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ లకు కనెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఇటివల UPI ద్వారా లావాదేవీలు (upi payments) చేయడానికి పరిమితి ఉండేది. కానీ, దీనిని ఆగస్ట్ 2024లో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) రూ. 5 లక్షల వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో NPCI పన్ను చెల్లింపు దారులు సెప్టెంబర్ 16, 2024 నుంచి UPI ద్వారా రూ. 5 లక్షల వరకు చెల్లింపులు చేసుకోవచ్చు. కేవలం పన్ను చెల్లింపులే కాదు, కొత్త UPI పరిమితి ప్రకారం వినియోగదారులు విద్య, ఆసుపత్రులు, RBI రిటైల్ డైరెక్ట్ స్కీమ్, IPO లకు సంబంధించిన లావాదేవీలను కూడా నేరుగా చేయవచ్చు. ఎంపిక చేసిన లావాదేవీలకు మాత్రమే UPI లావాదేవీ పరిమితిలో మార్పులు చేశారు. సెప్టెంబర్ 15 లోగా కొత్త పరిమితిని పాటించాలని బ్యాంకులు, చెల్లింపు సర్వీస్ ప్రొవైడర్లు, UPI యాప్‌లను NPCI ఇప్పటికే ఆదేశించింది.

అయినప్పటికీ..

సాధారణంగా UPI లావాదేవీ పరిమితి రూ. 1 లక్ష వరకు ఉండేది. కానీ, బ్యాంకులు కూడా సొంత పరిమితులను సెట్ చేసుకునే హక్కును కలిగి ఉంటాయి. ఉదాహరణకు హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్ తమ కస్టమర్‌ లకు రూ. 1 లక్ష వరకు యూపీఐ లావాదేవీలు చేయడానికి అనుమతిస్తాయి. అలహాబాద్ బ్యాంక్ కస్టమర్లకు UPI లావాదేవీ పరిమితి రూ. 25,000 మాత్రమే. ఇది కాకుండా Google Pay, Phone Pe, Paytm మొదలైన UPI యాప్‌లు కూడా వాటి సొంత పరిమితిని కలిగి ఉంటాయి. బీమా చెల్లింపులు రూ.2 లక్షల వరకు, ఇతర మూల ధన సంబంధిత UPI లావాదేవీలు కూడా చేసుకోవచ్చు..

చెల్లింపు పద్ధతి..

UPI లేదా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ ఫేస్ అనేది భారత దేశంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ద్వారా అభివృద్ధి చేయబడిన డిజిటల్ చెల్లింపు వ్యవస్థ. ఈ వ్యవస్థ ఆర్థిక లావాదేవీ లను సురక్షితమైన పద్ధతిలో అనుమతిస్తుంది. UPI సిస్టమ్ అన్ని సమయాలలో (24 గంటలు, 7 రోజులు) అందుబాటులో ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా లావాదేవీలు చేసుకోవచ్చు. UPI లావాదేవీ లకు సురక్షితమైన PIN (UPI PIN) అవసరం. ఇది మీ ఆర్థిక సమాచారం భద్రతను నిర్ధారిస్తుంది. QR కోడ్‌ ద్వారా కూడా UPI చెల్లింపులు చేయవచ్చు. వ్యక్తి గత లావాదేవీలు, బిల్లు చెల్లింపులు, టాక్సీ ఛార్జీలు, రెస్టారెంట్ బిల్లులు, ఆన్‌లైన్ షాపింగ్, ప్రభుత్వ సేవల చెల్లింపుల కోసం కూడా UPIని ఉపయోగించుకోవచ్చు..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..