UPI transactions in July: దేశంలో డిజిటల్ చెల్లింపుల పుణ్యమా అని ఫోన్ పే మరోసారి తన ఆధిపత్యం కొనసాగించింది. గత జూలై నెలలోయూపీఐ (యూనిఫైడ్ పే మెంట్ ఇంటర్ ఫేస్) చెల్లింపుల్లో ఫోన్ పే తన మార్కెట్ షేర్ ని బాగా పెంచుకోగలిగింది. గూగుల్ పేని కూడా అధిగమించింది. నేషనల్ పే మెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ)డేటా ఆధారంగా ఈ విషయం వెల్లడైంది. గూగుల్ పేని అధిగమించడం ద్వారా జూలైలో యూపీఐ లావాదేవీల్లో ఫోన్‌పే 1.4 బిలియన్ లావాదేవీలను నిర్వహించి 46 శాతం మార్కెట్ షేర్‌ను సంపాదించుకోగలిగింది. కోవిడ్ నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం పెరగడంతో డిజిటల్ చెల్లింపుల సిస్టం కూడా బిజినెస్ పెరగడానికి దోహదపడింది. ట్రెండ్‌ను బట్టి చూస్తే రానున్న సంవత్సరాల్లో యూపీఐ విధానం ఇంకా పెరుగుతూనే ఉంటుందని భావిస్తున్నారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రకారం.. జూలైలో ఫోన్‌పే ద్వారా మొత్తం రూ.288,572 కోట్లు లావాదేవీలు జరిగాయి. గూగుల్‌పే అత్యధికంగా 1,119.16 మిలియన్ లావదేవీలను నిర్వహించింది. దీంతో రూ.230,874 కోట్లకు చేరుకుంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకు యాప్‌లో రూ.51,694 కోట్ల విలువైన 454.06 మిలియన్ లావాదేవీలు జరిగాయి. గూగుల్‌పే వాల్యూమ్ మార్కెట్ షేర్ 34.45 శాతం, పేటీఎం పేమెంట్స్ బ్యాంకు యాప్ 14 శాతం వద్ద ఉన్నాయి.