UPI-Help: గూగుల్‌పే, ఫోన్‌పేలో డబ్బులు పంపితే మీ అకౌంట్లో డెబిట్ అయినా అవతలి వ్యక్తికి పోలేదా..? ఇలా చేయండి

|

Mar 25, 2021 | 4:01 PM

UPI-Help: ఫోన్‌పే, గూగుల్‌ పే వంటి నగదు బదిలీ యాప్‌లు అందుబాటులోకి వచ్చాక చెల్లింపుల విధానం చాలా పెరిగిపోయాయి. ప్రతి ఒక్కరు ఆన్‌లైన్‌ బదిలీలకు..

UPI-Help: గూగుల్‌పే, ఫోన్‌పేలో డబ్బులు పంపితే మీ అకౌంట్లో డెబిట్ అయినా అవతలి వ్యక్తికి పోలేదా..? ఇలా చేయండి
Upi Help
Follow us on

UPI-Help: ఫోన్‌పే, గూగుల్‌ పే వంటి నగదు బదిలీ యాప్‌లు అందుబాటులోకి వచ్చాక చెల్లింపుల విధానం చాలా పెరిగిపోయాయి. ప్రతి ఒక్కరు ఆన్‌లైన్‌ బదిలీలకు అలవాటు పడిపోయారు. అయితే కొన్ని కొన్ని సందర్భాలలో మనం పంపిన డబ్బులు అవతలి వ్యక్తికి వెళ్లవు. కానీ మన అకౌంట్లో డబ్బులు మాత్రం కట్‌ అవుతాయి. ఇలాంటి సమస్యలు చాలా మందికి ఎదురవుతుంటాయి. ఎందుకంటే సిగ్నల్స్‌ సరిగా ఉండకపోవడంతో నెట్‌ వర్క్‌ సమస్య తెలెత్తడం, ఇతర కారణాలు చాలా ఉంటాయి. ఇలాంటి ఆన్‌లైన్‌ బదిలీల యాప్‌లు లేని సమయంలో బ్యాంకుల వద్ద జనాలు క్యూకట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు కొత్త కొత్త యాప్‌లు అందుబాటులోకి రావడంతో బ్యాంకుల వద్ద జనాలు తక్కువగానే ఉంటున్నారు. మొబైల్‌ ఫోన్‌ ఉంటే చాలు క్షణాల్లోనే డబ్బులు బదిలీ చేసే సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఫోన్‌ పే, గూగుల్‌ పే నుంచి బదిలీ చేసిన డబ్బులు మన ఖాతాలో కట్‌ అయి అవతలి వ్యక్తుల ఖాతాల్లోకి వెళ్లకపోతే ఏం చేయాలి…? ఇలాంటి ఫిర్యాదులు ఆర్బీఐకి చాలా వస్తున్నాయి.

2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అంబుడ్స్‌మన్‌ పథకాల నివేదిక ప్రకారం.. బీమ్‌, గూగుల్‌ పే, ఫోన్‌ పే, అమెజాన్‌ పే వంటి యూపీఐ ఆధారిత మొబైల్‌ యాప్‌లలో ట్రాన్స్‌క్షన్‌ ఫెయిల్యూర్స్‌పై దాదాపు 44 శాతం ఫిర్యాదులు వచ్చాయి. వీటికి చెక్‌ పెట్టేందుకు నేషనల్‌ పేమెంట్స్‌పై కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) నడుం బిగించింది. యూపీఐ లావాదేవీలు నిర్వహిస్తున్న సమయంలో ఎదురయ్యే సమస్యలను , వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించడానికి భీమ్‌ యాప్‌లో, యూపీఐ-హెల్ప్‌ అనే ఆప్షన్‌ను ప్రారంభించింది. దీని కోసం ఉచిత గ్రీవెన్స్‌ రిజల్యూషన్‌ మెనికాజంను అందుబాటులోకి తీసుకువచ్చింది.

భీమ్‌ యూపీఐ- హెల్ప్‌ ఫీచర్‌తో ఉపయోగం ఏమిటీ..?

మీ BHIM UPI యాప్​ను ఉపయోగించి మీరు ఒక వ్యక్తికి లేదా వ్యాపారికి డబ్బు బదిలీ చేసే క్రమంలో మీ బ్యాంక్ ఖాతా నుండి నగదు డెబిట్ అవుతుంది. కానీ. బదిలీ ప్రాసెస్ చేయబడుతుందని యాప్​ మీకు చూపిస్తుంది. అటువంటి సమస్యను పరిష్కరించడానికి భీమ్ యూపీఐ హెల్త్​ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఈ భీమ్​ యూపీఐ ఫీచర్​ పెండింగ్​లో ఉన్న లావాదేవీల స్టేటస్​ను చెక్​ చేసుకోవడం కోసం, ప్రాసెస్ చేయని లేదా మీరు పంపే నగదు అవతలి వ్యక్తి ఖాతాకి చేరకపోతే ఫిర్యాదు చేయడానికి ఉపయోగపడుతుంది. దీని ద్వారా బిజినెస్​ లావాదేవీలకు సంబంధించిన ఫిర్యాదులను కూడా చేయవచ్చు.

ఏయే బ్యాంకులకు..

లావాదేవీలు నిలిచిపోయినా.. పెండింగ్‌లో ఉన్నా యూపీఐ హెల్ప్‌ మీ సమస్య పరిష్కారానికి కృషి చేస్తుంది. ప్రస్తుతం ఈ సేవలను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ), యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌ డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ కస్టమర్ల కోసం భీమ్‌ యాప్‌లో ఈ సేవలు ప్రారంభం అయ్యాయి. త్వరలోనే పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌, టీజేఎస్‌బీకో ఆపరేటివ్‌ బ్యాంక్‌ వినియోగదారులకు కూడా ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

ఫిర్యాదు ఎలా చేయాలి.?

భీమ్‌ యూపీఐ యాప్‌లో మీకు ‘రెయిజ్‌ ఎ కంప్లెయింట్‌’ అనే ఆప్షన్‌ అందుబాటులో ఉంది. అందులో మీరు ఫిర్యాదు చేయాలనుకుంటున్న లావాదేవీని ఎంచుకోవాలి. అప్పుడు మీకు రెయిజ్‌ కన్‌సర్న్‌ కాల్‌ బ్యాంక్‌ అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. ఒక వేళ మీరు లావాదేవీతో ఏదైనా సమస్యను ఎదుర్కొంటే రెయిజ్‌ కన్సర్న్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. మీ సమస్యను ఆన్‌లైన్‌లో తెలపండి. అప్పటికి మీ సమస్య పరిష్కారం కాకపోతే మీరు BHIM యాప్‌ కస్టమర్‌ హెల్ప్‌ లైన్‌ నెంబర్‌ 1800-120 174కు కాల్​ చేయవచ్చు.

ఇవీ చదవండి : PAN Aadhaar: మార్చి 31 వచ్చేస్తోంది.. ఈ పని చేయకపోతే వెంటనే చేసుకోండి.. గడువు ముగిసిందంటే ఇక అంతే

Price Hike: ఏప్రిల్‌ 1 నుంచి బాదుడే.. బాదుడు.. వీటి ధరలు భారీగా పెరగనున్నాయి…కొనాలంటే ఇప్పుడే కొనేయండి..!

Health Check-up Benefits: మార్చి 31లోపు ఇలా చేయండి.. రూ.50 వేల వరకు ప్రయోజనం పొందే అవకాశం..!