భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు అమ్మకాలు తారాస్థాయికు చేరాయి. ముఖ్యంగా పెరుగుతున్న పెట్రోల్ ధరల దెబ్బకు సామాన్యుడు స్కూటర్ కొనాలంటే ఈవీ వైపు చూసే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వాలు కూడా పెరుగుతున్న కాలుష్యానికి అడ్డుకట్ట వేయడానికి ఈవీ వాహనాలపై ప్రత్యేక సబ్సిడీలను అందిస్తూ కొనుగోలు ప్రోత్సహిస్తున్నాయి. దీంతో భారతదేశంలో అన్ని కంపెనీలు తక్కువ ధరల్లోనే ఈవీలను లాంచ్ చేశాయి. ఈ ఈవీల్లో ఓలా స్కూటర్లు అత్యంత ప్రజాదరణ పొందాయి. ముఖ్యంగా తక్కువ ధరకే అధునాతన ఫీచర్లు ఉండేలా ప్రత్యేక వెర్షన్లను రిలీజ్ చేసిన ఓలా తాజాగా తన ఎస్1 ఎక్స్ ఫీచర్లను అప్‌డేట్ చేసినట్లు ప్రకటించింది. ఓలా ఎస్ 1 ఎక్స్ స్కూటర్‌కు ముఖ్యమైన అప్‌డేట్ ఇచ్చిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీన్ని ఎస్ 1 ఎక్స్ ప్రత్యేక అనుభూతిని పొందుతారని వివరిస్తున్నారు. ఈనేపథ్యంలో ఎస్ 1 ఎక్స్ తాజా అప్‌డేట్స్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ఓలా ఎస్ 1 ఎక్స్ తాజా అప్‌డేట్‌లో ఓవర్-ది-ఎయిర్ ఫీచర్‌ను పరిచయం చేసింది. ఈ ఫీచర్ వల్ల సర్వీస్ సెంటర్‌ను సందర్శించాల్సిన అవసరం లేకుండానే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసుకోవచ్చు. ఈ కొత్త సామర్థ్యం కస్టమర్‌లు తమ స్కూటర్‌లను తాజా సాఫ్ట్‌వేర్ మెరుగుదలలతో సులభంగా అప్‌డేట్‌గా ఉంచుకోవచ్చని ఆ కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. అలాగే ప్రత్యేకంగా పరిచయం చేసిన వెకేషన్ మోడ్ వల్ల ఎక్కువ కాలం స్కూటర్ ఉపయోగంలో లేనప్పుడు స్లీప్ మోడ్‌లోకి ఆటోమేటిక్‌గా వెళ్తుంది. దీని వల్ల బ్యాటరీ లైఫ్‌టైమ్ మెరుగు అవుతుంది. అలాగే ఓలా అధునాతన రీజెనరేటివ్ బ్రేకింగ్ (రీజెన్)ను కూడా ప్రవేశపెట్టింది. ఈ కారణంగా ఈ స్కూటర్ వేగంగా చార్జ్ అవుతుంది. ఫైండ్ స్కూటర్ వల్ల కూడా మన స్కూటర్‌ను వేరే వాళ్లకి ఇచ్చినప్పుడు స్కూటర్ స్థితిని మన ఫోన్ నుంచి చూసే వెసులుబాటు ఉంటుంది.
అప్‌డేటెడ్ ఎస్ 1 ఎక్స్ డెలివరీలు మేలో ప్రారంభమయ్యాయి. ఈ స్కూటర్ మూడు విభిన్న బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో అందుబాటులో ఉంది. 2 కేడబ్ల్యూ, 3 కేడబ్ల్యూ, 4 కేడబ్ల్యూ వేరియంట్స్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ వేరియంట్‌ల సంబంధిత ధరలు రూ.74,999 నుంచి రూ.99,999 వరకూ ఉంటాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి