IDBI Bank: ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను వరుసగా కేంద్ర ప్రభుత్వం డిస్ ఇన్వెస్ట్ మెంట్(Disinvest) చేస్తూ పోతోంది. తాజాగా కేంద్రం మరో భారీ పెట్టుబడుల ఉపసంహరణకు సిద్ధమైంది. ప్రభుత్వ రంగంలోని(Public sector) బ్యాంక్‌ను ప్రైవేటు పరం చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఐడీబీఐ బ్యాంక్‌లో ప్రభుత్వ వాటాలను అమ్మేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ, పెట్టుబడుల శాఖ కార్యదర్శి తుహిన్ కాంత పాండే ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు. బ్యాంకులోని ప్రభుత్వానికి ఉండే వాటాలను అమ్మేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అయితే ఏ మేరకు వాటాలను అమ్మాలనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని తెలిపారు. ఐడీబీఐ బ్యాంకులో కేంద్రానికి 45.48 శాతం వాటా ఉంది. ఈ క్రమంలోనే మొత్తం వాటాను మార్కెట్ ధరకు ఒకేసారి అమ్మేయాాలా లేక కొంత భాగాన్ని మాత్రమే అమ్మాలా అనే దానిపై కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోందని తెలియజేశారు. గత సంవత్సరమే బ్యాంకులో వాటాలను అమ్మాలని కేంద్ర ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది. దీనికి అవసరమైన చట్టసవరణలను కూడా చేసింది.
త్వరలో ఈప్రక్రియ ప్రారంభం అవుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎల్‌ఐసీ ఐపీవో సజావుగా సాగేందుకు పేటీఎం మనీ అనే సరికొత్త ఫీచర్‌ను కూడా కేంద్రం అమలులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా రూ. 5 లక్షల విలువైన షేర్లను యూపీఐ ద్వారా బిడ్డింగ్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. సెబీ జారీ చేసిన మార్గదర్శకాల మేరకు ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సౌకర్యం అమలులోకి రాక ముందు ఒక్కో ఇన్వెస్టర్ కేవలం రూ. 2 లక్షల వరకు మాత్రమే యూపీఐ ద్వారా బిడ్డింగ్ చేసుకునే అవకాశం ఉండేది.
ఎల్‌ఐసీ ఐపీఓకు మార్కెట్‌లో భారీగా డిమాండ్ ఉంది. పలు సంస్థలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇప్పటికే 25కుపైగా ఇన్వెస్టర్లు ఎల్‌ఐసీ షేర్ల కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తున్నారని కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. స్వదేశీ ఇన్వెస్టర్లతో పాటు విదేశాలకు చెందిన పెట్టుబడిదారులు కూడా ఊ ఐపీవో పట్ల ఆసక్తి కనబరుస్తున్నారని చెప్పింది. దీని ద్వారా సేకరించిన నిధులతో సంక్షేమ, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కేంద్రం యోచిస్తోంది. దేశ ఆర్థిక ప్రగతికి దోహదపడేందుకు అవసరమైన నిధులను సమకూర్చుకోవడం ద్వారా దేశ ఆర్థిక ప్రగతి వేగవంతం చేయవచ్చని కేంద్రం భావిస్తోంది. అందువల్లనే కేంద్రం ప్రైవేటీకరణ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రయత్నిస్తోంది.
ఇవీ చదవండి..
Travel: భారతదేశంలోని ఈ 5 సరస్సుల అందాలను చూసి మీరు మైమరచిపోతారు