జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రపతి ప్రసంగంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు ఆర్థిక సర్వే నివేదికను ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. దీని తరువాత ఫిబ్రవరి 1 న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ బడ్జెట్‌ను సమర్పించనున్నారు.
మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ఐదవ, చివరి పూర్తి బడ్జెట్. బడ్జెట్ సమర్పణ అనంతరం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై కూడా చర్చ జరగనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బడ్జెట్ సమావేశాల మొదటి రోజున మొదటిసారి పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
బడ్జెట్ సమావేశాలు రెండు దశల్లో జరగనున్నాయి. మొదటి దశ జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు కొనసాగుతుంది. దీని తరువాత ఫిబ్రవరి 14 నుండి మార్చి 12 వరకు సెలవు ఉంటుంది. ఈ సందర్భంగా వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు గ్రాంట్ల డిమాండ్‌పై చర్చించి నివేదికలు సిద్ధం చేస్తాయి. రెండో విడత బడ్జెట్ సమావేశాలు మార్చి 13న ప్రారంభం కానున్నాయి. రెండో దశలో ఆర్థిక బిల్లుపై పార్లమెంటు ఉభయ సభల్లో చర్చ జరగనుంది. చర్చల అనంతరం ఉభయ సభల్లో బిల్లు ఆమోదం పొందుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి