Bike Sales: అదిరిపోయే ఆఫర్.. ఈ స్కూటర్‌ను కేవలం రూ. 25 వేలకే సొంతం చేసుకోండి.. వివరాలు ఇవిగో!

|

Feb 08, 2023 | 10:19 AM

ప్రస్తుత స్కూటర్ల మార్కెట్ ధరలు ఆకాశానంటుతున్నాయి. ఎక్స్ షో-రూమ్ రేట్లు రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు ఉండగా..

Bike Sales: అదిరిపోయే ఆఫర్.. ఈ స్కూటర్‌ను కేవలం రూ. 25 వేలకే సొంతం చేసుకోండి.. వివరాలు ఇవిగో!
Mastero
Follow us on

ప్రస్తుత స్కూటర్ల మార్కెట్ ధరలు ఆకాశానంటుతున్నాయి. ఎక్స్ షో-రూమ్ రేట్లు రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు ఉండగా.. మధ్యతరగతి ప్రజలు సెకండ్ హ్యాండ్ బైక్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే అదిరిపోయే మైలేజ్.. తక్కువ బడ్జెట్‌తో పలు బైక్ మోడల్స్ ప్రముఖ ఆన్‌లైన్ విక్రయాల వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలోనే హీరో మాస్ట్రో స్కూటర్ కేవలం రూ. 25 వేలకే అమ్మకానికి ఉంచింది ‘బైక్స్ 24’ వెబ్‌సైట్. మరి ఆ వివరాలు ఏంటో తెలుసుకుందామా.?

సెకండ్ హ్యాండ్ బైక్‌లను విక్రయించే ప్రముఖ ఆన్‌లైన్ వెబ్‌సైట్ ‘బైక్స్ 24’ హీరో మాస్ట్రో(Hero Mastero) స్కూటర్‌ను కేవలం రూ. 25 వేలకే విక్రయానికి ఉంచింది. ఢిల్లీ రిజిస్ట్రేషన్‌తో అందుబాటులో ఉన్న ఈ స్కూటర్ 2019 మోడల్‌ది. 6600 కిలోమీటర్లు తిరిగిన ఈ వాహనాన్ని ఫస్ట్ ఓనర్ విక్రయిస్తున్నాడు. ఇక ఇది లీటర్‌కు 53 కిలీమీటర్ల మైలేజ్ అందిస్తుంది. అలాగే ఈ స్కూటర్‌పై ఏడాది వారంటీ, ఏడు రోజుల మనీ క్యాష్‌బ్యాక్ గ్యారంటీ కూడా ఉంది. లేట్ ఎందుకు ఓసారి మీరూ లుక్కేయండి. కాగా, సెకండ్ హ్యాండ్ బైక్‌లు కొనేటప్పుడు బైక్ యజమానిని కలవకుండా, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ స్వయంగా ధృవీకరించకుండా ఆర్ధిక లావాదేవీలు చేయకండి.