Vijay Mallya: భారతదేశం నుంచి పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా ఆస్తులను జప్తు చేసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా బ్యాంకులకు అవకాశం కుదిరింది. విజయ్ మాల్యా దివాళా తీసినట్లు యుకె కోర్టు ప్రకటించింది. ఈ ఉత్తర్వుతో, భారత బ్యాంకులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మాల్యా ఆస్తులను సులభంగా జప్తు చేయగలవు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) నేతృత్వంలోని భారతీయ బ్యాంకుల కన్సార్టియం మాల్యాపై బ్రిటిష్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. చీఫ్ ఇన్సాల్వెన్సీ అండ్ కంపెనీస్ కోర్ట్ (ఐసిసి) జడ్జి మైఖేల్ బ్రిగ్స్ హైకోర్టులోని చాన్సరీ విభాగంలో వర్చువల్ విచారణ నిర్వహించారు. ఆయన తన తీర్పులో- ”నేను డాక్టర్ మాల్యా దివాలా తీర్పుని ప్రకటిస్తున్నాను.” అని చెప్పారు. లండన్ హైకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా అప్పీల్ చేసే అవకాశం మాల్యాకు లేదు.
అప్పగించే వరకు మాల్యా UK లో బెయిల్‌పై ఉంటాడు
న్యాయ సంస్థ టిఎల్‌టి ఎల్‌ఎల్‌పి, న్యాయవాది మార్సియా షెకర్‌డామియన్ విచారణ సందర్భంగా భారత బ్యాంకుల తరఫున హాజరయ్యారు. 65 ఏళ్ల మాల్యా తనను అప్పగించడానికి సంబంధించిన చట్టపరమైన చర్యలు పూర్తయ్యే వరకు యూకేలో బెయిల్‌పై ఉంటాడు. విచారణ సందర్భంగా, మాల్యా యొక్క న్యాయవాది ఫిలిప్ మార్షల్ భారత కోర్టులలో చట్టపరమైన సవాళ్లు కొనసాగే వరకు ఈ ఉత్తర్వును నిలిపివేయాలని కోరారు. అయితే, అతని న్యాయవాదుల డిమాండ్‌ను కోర్టు తిరస్కరించింది. మాల్యా మొత్తం డబ్బును సరైన సమయంలో బ్యాంకులకు తిరిగి ఇస్తారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని న్యాయమూర్తి స్పష్టంగా చెప్పారు.
దివాలా ఉత్తర్వులకు వ్యతిరేకంగా అప్పీల్ చేయడానికి అనుమతి కోరుతూ మాల్యా యొక్క న్యాయవాదులు కోర్టుకు ఒక దరఖాస్తును సమర్పించారు, దీనిని న్యాయమూర్తి బ్రిగ్స్ తిరస్కరించారు.
మాల్యాకు చెందిన విమానయాన సంస్థ కింగ్‌ఫిషర్ ఆర్థిక సంక్షోభం కారణంగా 2012 అక్టోబర్ 20 నుండి మార్చి 2016 వరకు భారతదేశం నుండి ఒక్క విమానమూ బయటికి వెళ్లలేకపోయింది. రుణాలు చెల్లించనందుకు, బ్యాంకులను మోసం చేశారనే ఆరోపణలతో విజయ్ మాల్యాను 2019 జనవరిలో పారిపోయిన ఆర్థిక నేరస్థుడిగా ప్రకటించారు. మాల్యా 2 మార్చి 2016 న భారతదేశం విడిచి వెళ్లారు.
మాల్యా కేసు ప్రధాన వివరాలు ఇవీ..
ఎస్బిఐతో సహా 13 బ్యాంకులు మాల్యాపై పిటిషన్ దాఖలు చేశాయి, ఎస్బిఐ నాయకత్వంలో 13 బ్యాంకులు లండన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, కార్పొరేషన్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ లిమిటెడ్, ఐడిబిఐ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, జమ్మూ కాశ్మీర్ బ్యాంక్, పంజాబ్ మరియు సింధ్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, యుకో బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, జెఎమ్ ఫైనాన్షియల్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కేసులో ప్రధాన పిటిషనర్లు.
Also Read: Bank Transactions: ఇకపై మీ ఈఎంఐలు బ్యాంకు సెలవు రోజుల్లో కూడా డెబిట్ అయిపోతాయి..ఎందుకో తెలుసుకోండి!