Aadhaar Toll Free: ఆధార్‌ సేవలకు టోల్‌ ఫ్రీ నంబర్‌.. 24 గంటల పాటు అందుబాటులో..

|

Jan 09, 2023 | 7:15 AM

ప్రస్తుత రోజుల్లో ఆధార్‌ తప్పనిసరైంది. ప్రభుత్వ, ప్రైవేటు పథకాలతో పాటు చిన్నా చితక పనులకు ఆధార్‌ తప్పనిసరి కావాల్సిందే. ఆధార్‌ లేనిది ఏ పని జరగదు. మీ ఆధార్ కార్డ్‌లో మీకు ఏదైనా..

Aadhaar Toll Free: ఆధార్‌ సేవలకు టోల్‌ ఫ్రీ నంబర్‌.. 24 గంటల పాటు అందుబాటులో..
Aadhaar
Follow us on

ప్రస్తుత రోజుల్లో ఆధార్‌ తప్పనిసరైంది. ప్రభుత్వ, ప్రైవేటు పథకాలతో పాటు చిన్నా చితక పనులకు ఆధార్‌ తప్పనిసరి కావాల్సిందే. ఆధార్‌ లేనిది ఏ పని జరగదు. మీ ఆధార్ కార్డ్‌లో మీకు ఏదైనా ఫిర్యాదు చేయాలనుకుంటే లేదా.. ఏదైనా సహాయం అవసరమైతే మీరు ఈ పనిని సులభంగా చేయవచ్చు. ఆధార్ జారీ చేసే సంస్థ యూఐడీఏఐకి ఫిర్యాదు చేయడం ద్వారా మీ సమస్యను పరిష్కరించుకోవచ్చని ఆధార్‌ సంస్థ యూఐడీఏఐ ట్విట్టర్‌ ద్వారా తెలిపింది. అయితే ఆధార్‌ కార్డు విషయంలో చాలా మందికి సమస్యలున్నాయి. ఆధార్‌ కార్డు నియంత్రణ సంస్థ యూఐడీఏఐ వినియోగదారులకు 24 గంటలు అందుబాటులో ఉండేలా కొత్త సర్వీసును అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఐవీఆర్‌ఎస్‌, ఎస్‌ఎంఎస్‌ ద్వారా అందించేందుకు 1947 టోల్‌ ఫ్రీ నంబర్‌ అందుబాటులో ఉంచింది. దీని ద్వారా ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ లేదా ఆధార్‌కు సంబంధించిన అప్‌డేట్‌ వివరాలను తెలుసుకోవచ్చు. అలాగే పీవీసీ కార్డు స్టేటస్‌ను ఎస్‌ఎంఎస్‌, కాల్‌ ద్వారా తెలుసుకోవచ్చు.వీటితో పాటు ఫిర్యాదుల స్టేటస్‌, ఆధార్‌ నమోదు కేంద్రాల వివరాలు ఈ సేవల ద్వారా తెలుసుకోవచ్చు. ఏ సాంకేతికత తెలియనివారికి 24/7 ఐవీఆర్‌ సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ నెల 2 నుంచి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌ ద్వారా చాట్‌ సపోర్ట్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు యూఐడీఏఐ ట్విట్టర్‌ ద్వారా తెలిపింది.

మెయిల్ ద్వారా కూడా ఫిర్యాదు:

మీకు ఏవైనా ఇతర రకాల ఫిర్యాదులు ఉంటే మీరు మెయిల్ ద్వారా కూడా ఫిర్యాదు చేసి సమస్యను పరిష్కరించుకోవచ్చు. దీని కోసం మీరు మీ ఫిర్యాదును help@uidai.gov.inకి పంపాలి. మెయిల్‌తో పాటు మీరు మీ ఫిర్యాదు, ఆధార్ కార్డ్ సమాచారం గురించి పూర్తి వివరాలను ఇవ్వాలి. మీ ఫిర్యాదు ఆధారంగా మీకు పూర్తి వివరాలు అందుతాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి