
ఆధార్ కార్డు ఉన్నవారికి బిగ్ అలర్ట్. యూఐడీఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంఆధార్ యాప్‌ను పూర్తిగా నిలిపివేసింది. యాప్ సేవలను పూర్తిస్థాయిలో నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇక నుంచి కొత్త ఆధార్ యాప్‌ను మాత్రమే ఉపయోగించాలని సూచించింది. కొత్త ఆధార్ యాప్ అందరూ వాడాలని యూఐడీఏఐ సిఫార్సు చేసింది. కొత్త యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించింది. కేంద్రం గత ఏడాది డిసెంబర్‌లో ఆధార్ కొత్త యాప్‌ను ప్రారంభించింది. ఆ యాప్‌లో అన్నీ సేవలు అందుబాటులో ఉన్నాయి. దీంతో ఎంఆధార్ యాప్ సేవలను నిలిపివేశారు.
“ఎంఆధార్ యాప్ త్వరలో నిలిపివేయబడుతోంది. ఇప్పుడు కొత్త ఆధార్ యాప్‌తో మరింత స్మార్ట్, వేగవంతం, సురక్షితమైన డిజిటల్ ప్రయాణాన్ని అనుభవించండి. సురక్షితమైన QR ఆధారిత ఆధార్ షేరింగ్ నుండి మెరుగైన గోప్యతా నియంత్రణలు, ఆధార్ సేవలకు నిరంతరాయ యాక్సెస్ వరకు.. మీ డిజిటల్ గుర్తింపు అనుభవాన్ని సరళతరం చేయడానికి ఈ కొత్త యాప్ రూపొందించబడింది. ఆధార్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి” అంటూ యూఐడీఏఐ పేర్కొంది.
ఈ ఏడాది జనవరి 28న ఆధార్ యాప్ కొత్త వెర్షన్‌ను కేంద్రం విడుదల చేసింది. ఇందులో మరిన్ని ఫీచర్లను జోడించింది. ఈ యాప్‌లో మీరు ఎక్కడినుంచైనా, ఎప్పుడైనా వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీ ఆధార్‌లో ఏ వివరాలు అయితే అవసరమో వాటిని మాత్రమే ఇతరులతో షేర్ చేసుకోవచ్చు. గతంలో ఆధార్ కార్డులను డిజిటల్‌గా నిల్వ చేసుకునేందుకు ఎంఆధార్ యాప్ ఉపయోగించేవారు. అయితే ఈ యాప్ ద్వారా ఎలాంటి సమాచారాన్ని అప్డేట్ చేసుకోవడం కుదరదు. కొత్త ఆధార్ యాప్‌లో అన్నీ సేవలు ఒకేచోట లభిస్తున్నాయి. దీంతో ఎంఆధార్ యాప్‌ను నిలిపివేశారు. అయితే కొత్త యాప్‌లో క్యూఆర్ కోడ్ గుర్తింపు ధృవీకరణ ఫీచర్ అందుబాటులో ఉంది. అంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఆధార్ ధృవీకరణ పూర్తవుతుంది. దీంతో మీరు జిరాక్స్ కాపీ ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఆధార్ యాప్‌లోని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. మీరు సిమ్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్, హోటళ్లు, దేవాలాయాల్లో అవసరమైన చోట సులువుగా ధృవీకరణ ప్రక్రియ పూర్తి చేయొచ్చు.
The #mAadhaar App is retiring soon. Now experience a smarter, faster, and more secure digital journey with the new #AadhaarApp. From secure QR-based #Aadhaar sharing to enhanced privacy controls and seamless access to Aadhaar services — the new app is designed to make your… pic.twitter.com/snfeUx4Rgr
— Aadhaar (@UIDAI) May 15, 2026