Aadhaar Card: ఆధార్ వాడేవారికి బిగ్ అలర్ట్.. కొత్త యాప్‌పై కేంద్రం అప్డేట్ ఇచ్చేసింది.. ఇకపై..

ఎంఆధార్ యాప్ సేవలు నిలిచిపోయాయి. దీని స్ధానంలో కొత్తగా తీసుకొచ్చిన ఆధార్ యాప్ ఉపయోగించాలని యూఐడీఏఐ సూచించింది. వినియోగదారులు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో భాగంగా పాత యాప్ సేవలను నిలిపివేసింది. కొత్త యాప్‌లో అనేక ఫీచర్లను జోడించింది. క్యూఆర్ కోడ్ వెరిఫికేషన్ సదుపాయం ఉంది.

Aadhaar Card: ఆధార్ వాడేవారికి బిగ్ అలర్ట్.. కొత్త యాప్‌పై కేంద్రం అప్డేట్ ఇచ్చేసింది.. ఇకపై..
Aadhaar App

Updated on: May 26, 2026 | 3:48 PM

యూఐడీఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. స్మార్ట్‌ఫోన్‌లో ఆధార్ సేవలు పొందే విధానంలో పెద్ద మార్పుకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఉన్న ఎంఆధార్ యాప్‌ను త్వరలో నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. దీని స్థానంలో కొత్త ఆధార్ యాప్ ఉపయోగించాలని సూచించింది. వినియోగదారులకు కట్టుదిట్టమైన భద్రత, వ్యక్తిగత డేటాపై నియంత్రణ, ఆధునిక డిజిటల్ ధృవీకరణ వ్యవస్థను వినియోగదారులకు అందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఐడీఏఐ స్పష్టం చేసింది. వినియోగదారులందరూ కొత్త యాప్‌కు మారాలని కోరింది. ఈ మేరకు ఎక్స్‌లో యూఐడీఏఐ ఓ పోస్ట్ పెట్టింది.

ఆధార్ కొత్త యాప్ ఫీచర్లు

కేంద్రం ఈ ఏడాది జనవరిలో ఆధార్ కొత్త యాప్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత పూర్తిస్థాయి వెర్షన్లను అప్‌గ్రేడ్ చేసింది. ఎంఆధార్ యాప్‌కు ప్రత్యామ్నాయంగా కాకుండా రోజువారీ జీవితంలో ఆధార్ ధృవీకరణ, గుర్తింపును పంచుకునే విధానాన్ని ఇది మారుస్తుంది. యాప్ పాత వెర్షన్ వెరిఫికేషన్ సమయంలో పూర్తి ఆధార్ వివరాలను చూపించేది. దీని వల్ల ఆధార్ దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే కొత్త యాప్‌లో క్యూఆర్ షేరింగ్, ఫేస్ అధెంటికేషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. క్యూఆర్ ఆధారిత ఆధార్ షేరింగ్ అనేది అది పెద్ద మార్పుల్లో ఒకటి. కొత్త యాప్‌లో క్యూఆర్ కోడ్ వెరిఫికేషన్ ద్వారా అవసరమైన ఆధార్ సమాచారాన్ని మాత్రమే వినియోగదారులు పంచుకోవచ్చు.

క్యూఆర్ కోడ్ ద్వారా..

పూర్తి ఆధార్ వివరాలను బహిర్గతం చేయకుండా అవసరమైన వివరాలను మాత్రమే క్యూఆర్ కోడ్ విధానం ద్వారా పంచుకోవచ్చు. ప్రభుత్వ ఆఫీసులు, ఆస్పత్రులు, హోటళ్లు, ఇతర చోట్ల ఆధార్ అవసరమైన చోట ఈ ఫీచర్ ఉపయోగించుకోవచ్చు. ఇక ఇప్పటివరకు ఆధార్ యాక్సెస్ ఓటీపీ ధృవీకరణ ద్వారా జరిగేది. కానీ కొత్త యాప్‌లో ఓటీపీతో పాటు ఫేస్ రికగ్నిషన్, క్యూఆర్ ధృవీకరణ ద్వారా కూడా యాక్సెస్ చేయవచ్చు. దుర్వినియోగాన్ని అరికట్టేందుకు, డిజిటల్ యాక్సెస్‌ను మెరుగుపర్చేందుకు ఈ కొత్త సౌకర్యం ప్రవేశపెడుతున్నారు. ఇక ఈ యాప్ ద్వారా సులువుగా బయెమెట్రిక్ లాక్ చేసుకోవడంతో పాటు మొబైల్ నెంబర్, అడ్రస్ లాంటివి సులువుగా అప్డేట్ చేసుకోవచ్చు.

 

 

Follow Us