
ఈ రోజుల్లో మహిళలు ఇంట్లో కూర్చుని పిల్లలను చూసుకోవడం మాత్రమే కాదు.. అనేక రంగాల్లో రాణిస్తున్నారు. అలాగే సొంత వ్యాపారాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. కొంతమంది మహిళలు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో పనిచేస్తున్నారు. ఇంకొంత మంది ఇంకా కొత్త వ్యాపారం ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు. అలాంటి వారికి చేయూతనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలు తెచ్చింది. వాటిలో ఒకదాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగిని యోజన అనే ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా మహిళలు తమ కాళ్లపై తాము నిలబడటానికి ఆర్థిక సహాయం అందిస్తారు. గత చాలా సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా ప్రభుత్వం మహిళలకు రుణం ఇస్తుంది. ఉద్యోగిని పథకం ద్వారా ఇవ్వబడిన ఈ రుణం పూచీకత్తు రహితం. అంటే ఈ రుణం ఇచ్చేటప్పుడు మహిళలు ఎటువంటి పూచీకత్తు పెట్టవలసిన అవసరం లేదు. ఈ పథకం కింద మహిళలు ఒకటి నుండి మూడు లక్షల రూపాయల వరకు రుణం పొందవచ్చు.
ఈ పథకాన్ని మొదట కర్ణాటక రాష్ట్రంలో ప్రారంభించారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా విస్తరించింది. ఈ పథకం కింద రుణం పొందడానికి మహిళ వయస్సు 18 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి. వికలాంగ మహిళలకు వయోపరిమితి లేదు. ఈ పథకాన్ని పొందడానికి మహిళ కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.5 లక్షలకు మించకూడదు. ఆధార్ కార్డు, ఓటరు కార్డు, ఫోటో, ఆదాయ ధృవీకరణ పత్రం, ప్రాజెక్ట్ రిపోర్ట్, కుల ధృవీకరణ పత్రం వంటి కొన్ని పత్రాలు అవసరం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి