బ్యాంకులు అమలు చేస్తున్న ఫిక్స్ డ్ డిపాజిట్ (ఎఫ్ డీ) పథకాలకు ప్రజల నుంచి మంచి ఆదరణ ఉంటుంది. డబ్బులను పెట్టుబడి పెట్టడానికి అత్యంత సురక్షితమైన మార్గంగా భావిస్తారు. నిర్ణీత సమాయానికి అసలు, వడ్డీతో కలిసి పెద్ద మొత్తంలో వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో అనేక మంది ఎఫ్ డీలలో తమ సొమ్ములను ఇన్వెస్ట్ చేస్తారు. ముఖ్యంగా సీనియర్లు సీటిజన్ల వీటిపై ఆసక్తి చూపుతారు. వీరికి సాధారణ ఖాతాదారుల కంటే ఎక్కువ వడ్డీరేట్లు అమలవుతాయి. అయితే ఎఫ్ డీలపై వడ్డీరేట్లు వివిధ బ్యాంకులలో వివిధ రకాలుగా ఉంటాయి. బ్యాంకులు కూడా ఖాతాదారులను ఆకట్టుకునేందుకు ఆకర్షణీయమై రేట్లు ప్రకటిస్తాయి. దీనిలో భాగంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. సీనియర్, సూపర్ సీనియర్ సిటిజన్ల ఎఫ్ డీలపై ఇప్పుడు ఇస్తున్న వడ్డీ రేటును 0.50 నుంచి 0.75 శాతం పెంచుతున్నట్టు తెలిపింది.
ఎఫ్ డీలపై వడ్డీరేటు పెంపు నిర్ణయాన్ని ఆగస్టు 27వ తేదీన యూనియన్ బ్యాంకు అధికారులు తీసుకున్నారు. దీని ప్రకారం రూ.5 కోట్ల వరకూ చేసిన టర్మ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 0.50, సూపర్ సీనియర్లకు 0.75 శాతం వడ్డీరేటును అందించనున్నారు. ఇది అన్ని దేశీయ టర్మ్ డిపాజిట్ పథకాలకు ఇది వర్తిస్తుంది. 2022 డిసెంబర్ ఒకటి తర్వాత చేసిన డిపాజిట్లు, లేదా పునరుద్ధరించిన డిజిపాట్లకు కొత్త వడ్డీరేటు వర్తిస్తుంది. రోజు వారీ ప్రాతిపదిక వడ్డీని లెక్కిస్తారు. ఏటా ఏప్రిల్, జూలై, అక్టోబర్, జనవరి త్రైమాసికాల్లో వడ్డీని జమ చేస్తారు. కొత్తగా ప్రకటించిన వడ్డీరేట్టు ఆగస్టు రెండో తేదీ నుంచి అమలులోకి వచ్చాయి. యూనియన్ బ్యాంక్ ఎఫ్ డీలపై కొత్త వడ్డీరేట్లు ఇలా ఉన్నాయి.
60 ఏళ్ల నుంచి 80 ఏళ్లు వయసు నిండిన వారందరూ ఎఫ్ డీలపై అదనపు వడ్డీరేటు పొందేందుకు అర్హులు. వీరిని సీనియర్, సూపర్ సీనియర్లు గా పరిగణిస్తారు. వీరు కొత్తగా డిపాజిట్ ఖాతా తెరవాలనుకుంటే తమ వయస్సును ధ్రువీకరించడానికి ఈ కింది తెలిపిన ప్రతాలలో దేనినైనా సమర్పించాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..