ఈనెలలో ఆ రెండురోజులూ బ్యాంకులు బంద్, ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగుల స‌మ్మె బాట

| Edited By: Team Veegam

Mar 04, 2021 | 2:43 PM

Bank Strike : బ్యాంకు ఉద్యోగులు మళ్లీ సమ్మె బాట పట్టబోతున్నారు. మార్చి 15, 16 తేదీల్లో బ్యాంకులు మూసివేసి తమ నిరసన వ్యక్తం చేయబోతున్నారు. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల‌ను..

ఈనెలలో ఆ రెండురోజులూ బ్యాంకులు బంద్, ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగుల స‌మ్మె బాట
Follow us on

Bank Strike : బ్యాంకు ఉద్యోగులు మళ్లీ సమ్మె బాట పట్టబోతున్నారు. మార్చి 15, 16 తేదీల్లో బ్యాంకులు మూసివేసి తమ నిరసన వ్యక్తం చేయబోతున్నారు. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల‌ను ప్రైవేటీక‌రించాల‌ని కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఇప్పటికే నిర్ణయానికి వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల15వ తేదీ నుంచి రెండు రోజుల పాటు స‌మ్మె చేయాల‌ని తొమ్మిది బ్యాంకు ఉద్యోగ సంఘాల స‌మాఖ్య.. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియ‌న్స్ (యూఎఫ్‌బీయూ) నిర్ణయించింది. ఏప్రిల 1 నుంచి వ‌చ్చే ఆర్థిక సంవ‌త్సరం (2021-22) వార్షిక బ‌డ్జెట్‌ను పార్లమెంట్‌కు స‌మ‌ర్పించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ‌న్ రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల‌ను ప్రైవేటీక‌రించ‌నున్నామ‌ని ప్రక‌టించిన నేపథ్యంలో బ్యాంకు ఉద్యోగుల సంఘాలు ఈ చర్యకు ఉపక్రమించాయి.

కాగా, UFBUలో అఖిల భార‌త ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ), అఖిల భార‌త బ్యాంక్ అధికారుల కాన్ఫిడ‌రేష‌న్‌ (ఏఐబీవోసీ), నేష‌న‌ల్ కాన్ఫిడ‌రేష‌న్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ (ఎన్సీబీఈ), అఖిల భార‌త బ్యాంక్ ఆఫీస‌ర్స్ అసోసియేష‌న్ (ఏఐబీవోఏ), బ్యాంక్ ఎంప్లాయీస్ కాన్ఫిడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా (బెఫీ) స‌భ్యులుగా ఉన్నాయి. ఇంకా ఇండియ‌న్ నేష‌న‌ల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడ‌రేష‌న్ (ఐఎన్‌బీఈఎఫ్‌), ఇండియ‌న్ నేష‌న‌ల్ బ్యాంక్ ఆఫీస‌ర్స్ కాంగ్రెస్ (ఐఎన్‌బీవోసీ), నేష‌న‌ల్ ఆర్గనైజేష‌న్ ఆఫ్ బ్యాంక్ వ‌ర్కర్స్ (ఎన్వోబీడ‌బ్ల్యూ), నేష‌న‌ల్ ఆర్గనైజేష‌న్ ఆఫ్ బ్యాంక్ ఆఫీస‌ర్స్ (ఎన్వోబీవో) కూడా ఇందులో స‌భ్య సంఘాలుగా ఉన్నాయి.

Read also : Hyderabad : A Pharma hub since Nizam’s era మీకు తెలుసా.! నిజాం కాలం నుంచే హైదరాబాద్ ఒక ఫార్మా హబ్

ఈ పది సెకండ్స్ వీడియో ఏకంగా రూ. 48 కోట్లకు అమ్ముడైంది.. ఎందుకు అంత ధర పలికిందో తెలుసా.!

పాల వ్యాపారంతో అదరగొడుతున్న 23 ఏళ్ల కుర్రాడు.. అవి అలాంటి ఇలాంటి పాలు కావు మరీ..! ఏంటో తెలుసా..