
చాలా మంది ప్రతి రోజు కనీసం నాలుగు సార్లు టీ, కాఫీలు తాగుతుంటారు. అంటే రోజుకు ఓ రూ.50 వేసుకున్నా.. నెలకు రూ.1500 కేవలం టీ, కాఫీ తాగేందుకే ఖర్చు చేస్తుంటారు. అయితే ఈ డబ్బులో కేవలం రూ.1000 మీరు సరైన మార్గంలో ఇన్వెస్ట్ ఈజీగా ధనవంతులు కావొచ్చు. మరి ఆ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ఏంటి? ఎలా పెట్టుబడి పెట్టాలనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ప్రతి నెలా కేవలం రూ.1000 SIPలో ఇన్వెస్ట్ చేస్తే ధనవంతులు అవ్వాలనే మీ కల నిజం అవ్వొచ్చు. కాంపౌండింగ్‌కి ఉండే శక్తి అలాంటిది. పెట్టుబడిదారులు తరచుగా తమకు ఎంత రాబడి వస్తుందో లేదా ఆల్ఫా ఎలా పొందాలో ఆలోచిస్తారు, కానీ వారు తరచుగా తమ నియంత్రణలో ఉన్న దానిపై దృష్టి పెట్టరు. వారు ఎంత డబ్బు పెట్టుబడి పెడతారు, వారు ఎంతకాలం పెట్టుబడిలో ఉంటారు అనే విషయాలు వారి రాబడిని డిసైడ్ చేస్తాయి. ముఖ్యంగా లాంగ్ టర్మ్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడి అందుకొని లక్షాధికారిగా మారొచ్చు.
ఒక మంచి మ్యూచువల్ ఫండ్‌ను ఎంచుకొని.. అందులో నెలకు కనీసం రూ.1000 నుంచి రూ.2000 పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్తే.. ఓ 15 నుంచి 20 ఏళ్లకు 12 శాతం వార్షిక వడ్డీ రేటు, చక్రవడ్డీ అంచనా వేసుకున్నా.. మెచ్యూరిటీ నాటికి మీ చేతికి ఒక భారీ మొత్తం రావడం ఖయం. అయితే మ్యూచువల్ ఫండ్స్‌లో సరైన దాన్ని ఎంచుకొని, క్రమ శిక్షణగా క్రమం తప్పకుండా దీర్ఘ కాలం పెట్టుబడి పెడితేనే మీ లక్ష్యాన్ని చేరుకుంటారని గుర్తుంచుకోండి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి