Business Ideas: ఎకరం పొలం ఉంటే చాలు.. ఒక్కసారి పెట్టుబడితో నెలకు రూ. 70 వేల వరకు సంపాదించవచ్చు..

|

May 15, 2023 | 7:30 PM

వ్యవసాయం సక్రమంగా చేస్తే అదనపు ఆదాయం దానంతట అదే వస్తుంది. మరి మీ దగ్గర కూడా ఒక ఎకరం పొలం ఉన్నట్లయితే.. ఒక్కసారి పెట్టుబడితో నెలకు మంచి లాభాన్ని పొందొచ్చు.

Business Ideas: ఎకరం పొలం ఉంటే చాలు.. ఒక్కసారి పెట్టుబడితో నెలకు రూ. 70 వేల వరకు సంపాదించవచ్చు..
Money
Follow us on

వ్యవసాయం సక్రమంగా చేస్తే అదనపు ఆదాయం దానంతట అదే వస్తుంది. మరి మీ దగ్గర కూడా ఒక ఎకరం పొలం ఉన్నట్లయితే.. ఒక్కసారి పెట్టుబడితో నెలకు మంచి లాభాన్ని పొందొచ్చు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందామా..

అరటి సాగు.. ఎంతోమంది రైతులకు మంచి లాభాలను ఇచ్చే పంట ఇది. ఒక్కసారి నాటిన అరటి మొక్క 5 సంవత్సరాల వరకు ఫలాలను అందిస్తుంది. దేశంలోని ప్రతి గ్రామంలో అరటి పండిస్తారు. అరటి సాగుతో తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందవచ్చు. ఇందువల్ల చాలామంది రైతులు ఈ రోజుల్లో అరటిపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. అలాగే ఈ అరటి సాగుకు వెచ్చని వాతావరణం ఉత్తమంగా పరిగణిస్తారు. అధిక వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో అరటి సాగు కష్టం. అరటి సాగుకు లివర్ లోమ్, క్లే లోమ్ నేలలు ఉత్తమమైనవి.

ఎకరానికి అరటి పండించడానికి దాదాపు రూ. 70 నుంచి రూ. 80 వేలు వరకు ఖర్చవుతుందని తెలుస్తోంది. ఆ ఒక్కసారి పెట్టుబడితో ఈ పంట ద్వారా సుమారు రూ. 3.5 నుంచి రూ. 4 లక్షల వరకు ఆదాయాన్ని సంపాదించవచ్చు. ఇతర పంటలతో పోలిస్తే ఈ సాగు సులభమే. అరటి పంటలు పండించడానికి సేంద్రియ ఎరువులు వాడటం వల్ల ఖర్చు కూడా బాగా తగ్గుతుంది. సేంద్రియ ఎరువు వాడితే మంచి పంట వస్తుంది. అరటి పండించిన తర్వాత మిగిలే వ్యర్థాలు పొలం బయట వేయకుండా పొలంలో వదిలేస్తే అద్భుతమైన ఎరువుగా మారుతాయి.

సింగపూర్‌లో ఎక్కువగా పండించే Robusta రకం అరటిపండ్లను మన దక్షిణాది దేశాల్లో బాగా సాగు చేస్తుంటారు. ఈ రకం అరటిలో ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. వామన్, సల్భోగ్, అల్పాన్, పువాన్ రకాలు కూడా మంచి అరటి రకాలు. అరటి సాగులో తక్కువ రిస్క్, అధిక రాబడి ఉంటుంది. అరటి ఆకులను అమ్మడం వల్ల అరటి సాగులో రెట్టింపు లాభాన్ని పొందవచ్చు. దీని ఆకులను రెస్టారెంట్లలో ప్లేట్లుగా ఉపయోగిస్తారు. సమాచారం ప్రకారం, ఒక మొక్క నుంచి 40-70 కిలోల ఉత్పత్తి లభిస్తుంది. మరోవైపు అరటిపండులో క్యాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉండటమే కాదు.. చక్కెర, ఖనిజ లవణాలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అరటిపండ్లు, అరటికాయలను కూడా మన చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు.