Best CNG cars: ఈ కార్లలో ప్రయాణం చాలా చవక.. పెట్రోలు వాహనాలకు బైబై

|

Dec 04, 2024 | 4:30 PM

ఆధునిక కాలంలో కారు అవసరం ప్రతి ఒక్కరికీ బాగా పెరిగింది. మధ్యతరగతి కుటుంబాలు సైతం వీటిిని వినియోగిస్తున్నాయి. కుటుంబంలో నలుగురు సభ్యులుంటే కారును కొనుగోలు చేస్తున్నారు. వేగంగా గమ్యస్థానానికి చేరుకోవడంతో పాటు సురక్షిత ప్రయాణం కోసం దీని అవసరం పెరిగింది.

Best CNG cars: ఈ కార్లలో ప్రయాణం చాలా చవక.. పెట్రోలు వాహనాలకు బైబై
Cng Cars
Follow us on

పెరుగుతున్న పెట్రోలు ధరలను చూసి చాలా మంది కార్లను కొనుగోలు చేయడానికి వెనుకంజ వేస్తున్నారు. నిర్వహణ వ్యయం బాగా పెరిగిపోతుందని భయపడుతున్నారు. కానీ ఇలాంటి ఆందోళనకు ఇక తెరదించే సమయం వచ్చేసింది. ప్రస్తుతం సీఎన్ జీ వెర్షన్ కార్లు అందుబాటులోకి వచ్చాయి. పెట్రోలుతో పోల్చితే సీఎన్ జీ ధర తక్కువగా ఉంటుంది. అలాగే రూ.పది లక్షల కంటే తక్కువ ధరకే వీటిని కొనుగోలు చేయవచ్చు. సాధారణంగా కార్లకు పెట్రోలు, డీజిల్ ను ఇందనంగా ఉపయోగిస్తారు. వీటి ధర ఎక్కువగా ఉండడంతో పాటు పర్యావరణానికి హాని కలుగుతోంది. ఈ నేపథ్యంలో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. సీఎన్జీ ధర తక్కువగా ఉండడంతో పాటు పర్యవరణానికి అనుకూలమైనది. ఈ కారణాలతో వివిధ కంపెనీలు సీఎన్ జీ వెర్షన్ల లో కార్లను విడుదల చేశాయి. ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులో ఉన్నసీఎన్ జీ కార్ల ప్రత్యేకతలను తెలుసుకుందాం.

టాటా పంచ్

దేశంలో ప్రముఖ కంపెనీ అయిన టాాటా నుంచి పంచ్ కారు విడుదలైంది. దీనిలో పెట్రోలు, ఎలక్ట్రిక్, సీఎన్ జీ అనే మూడు రకాల ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. ఐకానిక్ ఆల్ఫా ఆర్కిటెక్చర్ పై టాటా పంచ్ సీఎన్ జీ ఆధారపడింది. భద్రతపరంగా ఈ కారులో మంచి ఫీచర్లు ఉన్నాయి. ఐసీఎన్ జీ కిట్ ఈ కారులో అందుబాటులో ఉంటుంది. ఒక వేళ కారు నుంచి గ్యాస్ లీకేజీ ఏర్పడితే వెంటనే సీఎన్ జీ మోడ్ నుంచి పెట్రోల్ మోడ్ లోకి మారుతుంది. డ్యూయల్ ఎయిర్ బ్యాగులు, వాయిస్ సహాయక సన్ రూఫ్ అదనపు ప్రత్యేకతలు. ఐదు ఆకర్షణీయమైన రంగులలో అందుబాటులోకి వచ్చిన ఈ కారు ప్రారంభ ధర (ఎక్స్ షోరూమ్) రూ.7,22,900.

మారుతీ స్విఫ్ట్

సీఎన్ జీ కారు కోసం ఎదురు చూస్తున్న వారికి మారుతీ స్విఫ్ట్ మరో మంచి ఎంపిక. జెడ్ సిరీస్ ఇంజిన్, ఎస్- సీఎన్ జీ కలయికతో మూడు రకాల వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. ఈ కారు కేజీ సీఎన్ జీకి 32.85 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. అదనంగా 17.78 సెంటీమీటర్ల టచ్ స్క్రీన్, యూఎస్ బీ , బ్లూటూత్ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు ధర రూ.8.19 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.

ఇవి కూడా చదవండి

మారుతీ సుజుకి ఆల్టో కె10

మారుతీ సుజుకి ఆల్టో కె10 సీఎన్ జీ కారుకు మార్కెట్ లో మంచి ఆదరణ లభించింది. ఎందుకుంటే దీని ప్రారంభ ధర కేవలం రూ.5.73 లక్షలు మాత్రమే. దీనిలోని 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ సీఎన్ జీ మోడ్ లో 56 హెచ్ పీ, 52.1 ఎన్ఎం గరిష్ట టార్క్ ను విడుదల చేస్తుంది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం కేజీ సీఎన్ జీకి దాదాపు 34 కిలోమీటర్ల మైలేజీ వస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి