Telugu News Business Transferred money to wrong upi id via paytm phonepe or gpay a step by step guide in telugu
UPI Payments: యూపీఐ ద్వారా సొమ్ము ఒకరికి పంపబోయి వేరే వారికి పంపారా? ఈ టిప్స్‌తో సమస్య ఫసక్
ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో లక్షలాది మంది భారతీయులు నగదు బదిలీకు గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐ ఆధారిత చెల్లింపు యాప్‌లను ఉపయోగిస్తున్నారు. అయితే ఒక చిన్న తప్పుతో సొమ్ము వేరే వారికి బదిలీ అయిపోతూ ఉంటుంది. ఈ సొమ్మును ఎలా రిటర్న్ పొందాలో? చాలా మందికి తెలియదు. చిన్న మొత్తాల్లో చాలా మంది పట్టించుకోరు. కానీ పెద్ద మొత్తంలో సొమ్ము అయితే ఎలా పొందాలో? ఓ సారి తెలుసుకుందాం.
మీరు యూపీఐ ద్వారా ఒకరికి పంపబోయి వేరొకరికి సొమ్ము పంపారా? ఈ విషయంలో ఎలాంటి భయం వద్దని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు. అయితే మీ సొమ్ము రిటర్న్ పొందడం అనేది మీరు సొమ్ము పంపిన వ్యక్తి సహకారంతో పాటు బ్యాంక్ నిబంధనలపై ఆధారపడి ఉంటుందని గమనించించారు. ఆర్‌బీఐ, ఎన్‌పీసీఐ (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఈ తరహా కేసులను నిర్వహించడానికి అనేక మార్గదర్శకాలను అందించాయి. అవేంటో ఓ సారి తెలుసుకుందాం.
లావాదేవీ వివరాల తనిఖీ
మీ చెల్లింపు యాప్ ఓపెన్ చేసి ట్రాన్స్‌యాక్షన్ హిస్టరీను తనిఖీ చేయాలి.
తప్పు బదిలీని నిర్ధారించడానికి గ్రహీత వివరాలను ధ్రువీకరించుకోవలి.
రుజువుగా లావాదేవీ స్క్రీన్‌షాట్ తీసుకోవాలి.
గ్రహీతను సంప్రదించడం
మీరు పొరపాటున తెలిసిన పంపిన నంబర్‌ను కాంటాక్ట్ చేసి వారిని సంప్రదించి వాపసు కోసం అభ్యర్థించాలి.
సమస్యను నివేదన
ప్రతి యాప్‌లో ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి కస్టమర్ సపోర్ట్ ఉంటుంది. యాప్ ప్రొఫైల్ ద్వారా ప్రాబ్లెమ్ విత్ పేమెంట్ ఎంపిక ద్వారా సమస్యను తెలపాలి.
మీ బ్యాంక్ కస్టమర్ కేర్‌కు కాల్ చేసి సమస్యను వివరించాలి. యూటీఆర్ (ప్రత్యేక లావాదేవీ సూచన) సంఖ్యతో సహా లావాదేవీ వివరాలను అందించాలి. వీలైతే చెల్లింపును తిరిగి చెల్లించమని కోరుతూ బ్యాంక్ గ్రహీత బ్యాంకును సంప్రదించవచ్చు.
ఫిర్యాదు
మీ ఫిర్యాదుపై బ్యాంకు అధికారులు స్పందించకపోతే ఎన్‌పీసీఐ పోర్టల్ ద్వారా వివాద పరిష్కార యంత్రాగాన్ని సందర్శించి ‘లావాదేవీ’ కింద ఫిర్యాదును సమర్పించాలి.
అలాగే ఆర్‌బీఐకు సంబంధించిన ఫిర్యాదు నిర్వహణ వ్యవస్థలో ఆన్‌లైన్ ఫిర్యాదును దాఖలు చేసి , ఫిర్యాదును సమర్పించాలి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
తప్పుడు బదిలీలను నివారించడానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. చెల్లింపులను నిర్ధారించే ముందు ఎల్లప్పుడూ యూపీఐ ఐడీలను ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయాలి.
పెద్ద మొత్తాలను బదిలీ చేసే ముందు ముందుగా ఒక చిన్న మొత్తాన్ని పంపి విజయవంతంగా సొమ్ము వెళ్తే నే మిగిలిన మొత్తాన్ని పంపండి.
లోపాలను నివారించడానికి తరచుగా ఉపయోగించే యూపీఐ ఐడీలను సేవ్ చేయాలి.
మీ యాప్ సెట్టింగ్స్‌లో యూపీై చెల్లింపు నిర్ధారణలను ప్రారంభించడం ఉత్తమం.