Mobile Banking: మొబైల్ సేవల ద్వారా ఇంటర్నెట్ వ్యాప్తి పెరగడం దేశంలోని లావాదేవీల పద్ధతులపై తీవ్ర ప్రభావం చూపింది. ఏటీఎం(ATM) నుండి డబ్బు విత్‌డ్రా చేయడం ద్వారా నగదు వినియోగం నిరంతరం తగ్గుతోంది. మరోవైపు మొబైల్ బ్యాంకింగ్.. మొబైల్ వాలెట్ లావాదేవీలు వేగంగా పెరిగాయి. గత ఏడు సంవత్సరాలలో, మొబైల్ బ్యాంకింగ్ చివరి స్థానం నుండి మొదటి స్థానానికి చేరుకుంది.
మొబైల్ బ్యాంకింగ్ 65.8% వాటా..
రిజర్వు బ్యాంకు డాటా ప్రకారం, మొబైల్ బ్యాంకింగ్ అత్యధికంగా 65.8% పెరిగింది. ఈ సంవత్సరం మార్చి చివరిలో బ్యాంకు ఖాతాల నుండి మొత్తం లావాదేవీల్లో వాటా లెక్క ఇది.15.9% లావాదేవీలు మాత్రమే ఏటీఎంల ద్వారా జరిగాయి. మొబైల్ వాలెట్ 10.4% లావాదేవీలతో మూడో స్థానంలో..POS (పాయింట్ ఆఫ్ సేల్) 8% కంటే తక్కువ లావాదేవీలతో నాల్గవ స్థానంలో నిలిచింది. లావాదేవీల పరంగా, 2014 వరకు పరిస్థితి చాలా విరుద్ధంగా ఉంది. అప్పుడు 5 లో 4 లావాదేవీలు ఏటీఎం నుండి నగదు ఉపసంహరించుకోవడం ద్వారా జరిగాయి. ఆర్బీఐ డేటా ప్రకారం, 2014 లో మొత్తం లావాదేవీలలో (సంఖ్యల పరంగా) అత్యధికంగా 82.1% వాటాను ఏటీఎంలు కలిగి ఉన్నాయి.
విలువ పరంగా కూడా..
అత్యధిక లావాదేవీలు మొబైల్ బ్యాంకింగ్ ద్వారా జరుగుతున్నాయి. డేటా ప్రకారం, అత్యధిక మొత్తంలో లావాదేవీలు కూడా మొబైల్ బ్యాంకింగ్ ద్వారా జరుగుతున్నాయి. ఈ ఏడాది మార్చి వరకు మొబైల్ బ్యాంకింగ్ అత్యధికంగా 71% లావాదేవీలను కలిగి ఉంది. 22.6% లావాదేవీలతో ఏటీఎం రెండవ స్థానంలో ఉంది. 5.2% లావాదేవీలతో POS మూడవ స్థానంలో నిలిచింది. కేవలం 1.2% లావాదేవీలు మాత్రమే మొబైల్ వాలెట్ల ద్వారా జరిగాయి. 2014 వరకు పరిస్థితి దీనికి విరుద్ధంగా ఉంది. అత్యధికంగా 87.7% లావాదేవీలు ఏటీఎంల ద్వారా జరిగాయి. మొబైల్ బ్యాంకింగ్ ద్వారా 1% లావాదేవీలు మాత్రమే జరిగాయి.
లావాదేవీల ధోరణి ఇలా మారింది
ఇవి కూడా చదవండి: Telegram App: వంద కోట్ల డౌన్‌లోడ్‌లతో దూసుకుపోతున్న టెలిగ్రామ్ యాప్.. పదిహేను రోజుల్లో భారీగా చేరిన యూజర్లు..