పెరిగిన టెక్నాలజీ నేపత్యంలో బ్యాంకింగ్ సేవలు ప్రతి ఒక్కరికీ అందుతున్నాయి. ముఖ్యంగా బ్యాంకు ఖాతాలకు మొబైల్ నెంబర్లు లింక్ కావడం వల్ల మోసాలు బాగా పెరిగాయని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రత్యేక లింక్స్ ద్వారా మోసం చేయడానికి సైబర్ ముష్కరులు కాచుకుని కూర్చొన్నారు. అయితే ఈ మోసాలను అరికట్టేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)వినియోగదారులకు నిర్దిష్ట రకాల సందేశాలను పంపడాన్ని నిలిపివేయాలని టెలికాం కంపెనీలను ఆదేశించింది. ప్రత్యేకంగా ఏపీకేఫైల్‌లు, యూఆర్‌ఎల్‌లు, ఓటీటీ లింక్‌లు లేదా బ్లాక్‌లిస్ట్ చేయబడిన కాల్‌బ్యాక్ నంబర్‌లు ఉంటాయి. ఈ కొత్త నిబంధన సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో మోసాలను అరికట్టేందుకు ట్రాయ్ తీసుకున్న కీలక చర్యల గురించి ఓ సారి తెలుసుకుందాం.
ట్రాయ్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ముఖ్యంగా మెసేజ్‌ల ద్వారా మోసపూరిత కార్యకలాపాల నుండి వినియోగదారులను రక్షించడానికి వారి విస్తృత ప్రయత్నాలలో భాగంగా నిపుణులు పేర్కొంటున్నారు. టెలిమార్కెటింగ్ కాల్‌లకు సంబంధించి ట్రాయ్ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. సెప్టెంబర్ 30 నుంచి అన్ని టెలిమార్కెటింగ్ కాల్‌లు తప్పనిసరిగా 30140′తో ప్రారంభమయ్యే నంబర్‌ల నుంచి ప్రారంభం కావాలని స్పష్టం చేసింది. ఇంకా గత వారం, స్పామ్ కాల్‌లలో పాల్గొనే రిజిస్టర్ కాని టెలిమార్కెటర్ల టెలికాం వనరులన్నింటినీ డిస్‌కనెక్ట్ చేయాలని, వాటిని రెండేళ్లపాటు బ్లాక్‌లిస్ట్ చేయాలని టెలికాం కంపెనీలను ట్రాయ్ ఆదేశించింది. ఈ చర్యలు వినియోగదారుల భద్రతను పెంపొందించడంతో పాటు మోసపూరిత సమాచార ప్రసారాల ప్రభావాన్ని తగ్గించడంలో ట్రాయ్‌కు సంబంధించిన నిబద్ధతను ప్రతిబింబిస్తాయని వివరిస్తున్నారు. మెసేజ్ పంపినవారిని గుర్తించే సామర్థ్యాన్ని పెంచడానికి ట్రాయ్ నవంబర్ 1 నుంచి పంపినవారి నుంచి సీవర్ వరకు అన్ని సందేశాల మూలాన్ని గుర్తించడాన్ని తప్పనిసరి చేసింది.
టెలికాం కస్టమర్లకు ప్రమోషనల్ కాల్స్, మెసేజ్‌లు పంపే అనధికార టెలిమార్కెటింగ్ కంపెనీలను తగ్గించేందుకు ట్రాయ్ తీసుకున్న చర్యలు ముఖ్యమైనవని నిపుణులు చెబుతున్నారు. ప్రచార కంటెంట్‌ను నిర్వహించడం, వినియోగదారులను రక్షించడం కోసం ఫ్రేమ్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయడానికి ట్రాయ్ నిబంధనల దుర్వినియోగాన్ని నిరోధించడానికి ఈ కొత్త నిబంధనలు తీసుకొచ్చిందని పేర్కొంటున్నారు. ఈ కొత్త నిబంధనల ప్రకారం ఒక కంపెనీ తన ప్రచార కంటెంట్‌ను తప్పు కేటగిరీ కింద నమోదు చేస్తే అలాంటి కంటెంట్ వెంటనే బ్లాక్‌లిస్ట్ చేస్తారు. ఈ నిబంధనలను పదే పదే ఉల్లంఘిస్తే మరింత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రాయ్ హెచ్చరించింది. పంపినవారు నిబంధనలను విస్మరిస్తూ పదేపదే ఉల్లంఘనలకు పాల్పడితే, వారి సేవలు ఒక నెల మొత్తం నిలిపివేస్తామని స్పష్టం చేసింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి