Train Food Supply: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. అన్ని రైళ్లలో ఆహార సేవలు పునఃప్రారంభం..!

Train Food Supply: గత ఏడాదికిపైగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభించి ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. అయితే కోవిడ్‌ నేపథ్యంలో రైళ్లన్ని రద్దు అయ్యాయి. తర్వాత..

Train Food Supply: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. అన్ని రైళ్లలో ఆహార సేవలు పునఃప్రారంభం..!

Updated on: Nov 24, 2021 | 12:16 PM

Train Food Supply: గత ఏడాదికిపైగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభించి ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. అయితే కోవిడ్‌ నేపథ్యంలో రైళ్లన్ని రద్దు అయ్యాయి. తర్వాత లాక్‌డౌన్‌ సడలించిన తర్వాత దశల వారీగా రైళ్లను పునరుద్దరించింది రైల్వే శాఖ. కోవిడ్‌ తగ్గుముఖం పట్టిన తర్వాత కొన్ని ప్రత్యేక రైళ్లను ప్రత్యేక ట్యాగ్‌తో నడిపింది. అందులో అధిక ఛార్జీలను కూడా వసూలు చేసింది. ప్రస్తుతం ఆ ప్రత్యేక ట్యాగ్‌ను తొలగించి ఛార్జీలను కూడా తగ్గించింది. అలాగే రైళ్లను సరఫరా చేసే ఆహార సేవలను సైతం రద్దు చేసింది. తాజాగా అన్ని రైళ్లలో ఆహార సేవలను పునఃప్రారంభించింది రైల్వే శాఖ. కోవిడ్‌ తగ్గుముఖం పట్టిన దృష్ట్యా ఆహార సేవలు పునఃప్రారంభిస్తున్న రైల్వే శాఖ వెల్లడించింది. రైళ్లలో ఆహారం సరఫరాకు చర్యలు తీసుకోవాలని ఐఆర్‌సీటీసీ, జోన్ల కమర్షియల్‌ మేనేజర్లను, రైల్వే బోర్డును ఆదేశించింది రైల్వేశాఖ. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అన్ని రైళ్లలో ఆహార సేవలను పునరుద్ధరిస్తున్నట్లు రైల్వే శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. రాజధాని, శతాబ్ది, వందే భారత్‌, తేజస్‌, గతిమాన్‌ రైళ్లలో ఈ ఆహార సరఫరా సేవలు అందుబాటులోకి రానున్నాయి.

భారత్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడతుండటంతో ఒక్కొక్కటిగా ఆంక్షలను ఎత్తివేస్తోంది రైల్వేశాఖ. కాగా ఇప్పుడు రైలు ప్రయాణికులను దృష్టి లో ఉంచుకుని అన్ని రైళ్లలో కూడా ఆహారం అందించే సేవలను పునరుద్ధరించింది. కాగా రెస్టారెంట్లు, బార్లు, హోటల్స్ అన్ని కూడా కరోనా నిబంధనలతో కార్యకలాపాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి:

LPG Gas Subsidy: లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో ఎల్‌పీజీ గ్యాస్‌ సబ్సిడీ.. ఆన్‌లైన్‌లో చెక్‌ చేసుకోండిలా..!

Cheating: బంగారం కొనేందుకు వచ్చిన కస్టమర్లను మోసం చేస్తే దుకాణదారులకు ఎలాంటి శిక్ష ఉంటుంది..?