ప్రీపెయిడ్‌ వినియోగదారులకు TRAI గుడ్‌న్యూస్.. కానీ ఆపరేటర్లు ఏం చేస్తారో..?

| Edited By:

Mar 30, 2020 | 4:14 PM

ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా మహమ్మారితో వణికిపోతోంది. ఇప్పటికే ముప్పై వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు ఏడు లక్షల మంది వరకు దీని బారినపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా వైరస్ నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం మూడు వారాలపాటు లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజానికానికి అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా మొబైల్ వినియోగదారులు (ప్రీపెయిడ్‌) రీచార్జ్ చేయించుకునే విషయంలో కాస్త ఇబ్బందులు పడుతున్నారు. ప్రీపెయిడ్ వాలిడిటీ అయిపోతే.. వినియోగదారుడు ఇక […]

ప్రీపెయిడ్‌ వినియోగదారులకు TRAI గుడ్‌న్యూస్.. కానీ ఆపరేటర్లు ఏం చేస్తారో..?
Follow us on

ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా మహమ్మారితో వణికిపోతోంది. ఇప్పటికే ముప్పై వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు ఏడు లక్షల మంది వరకు దీని బారినపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా వైరస్ నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం మూడు వారాలపాటు లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజానికానికి అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా మొబైల్ వినియోగదారులు (ప్రీపెయిడ్‌) రీచార్జ్ చేయించుకునే విషయంలో కాస్త ఇబ్బందులు పడుతున్నారు. ప్రీపెయిడ్ వాలిడిటీ అయిపోతే.. వినియోగదారుడు ఇక అవుట్ గోయింగ్ సదుపాయాలు, ఇన్ కమింగ్ సదుపాయాలు నిలిచిపోతాయి. అయితే లాక్‌డౌన్ నేపథ్యంలో టెలికాం రంగాన్ని అత్యవసర సేవలుగా గుర్తించి మినహాయించినప్పటికీ.. స్థానికంగా మొబైల్ దుకాణాలు తెరిచిలేకపోవడంతో.. మెజార్టీ ప్రజలు రీచార్జ్ చేయించుకోలేకపోతున్నారు.

ఈ నేపథ్యంలో ట్రాయ్ వినియోగదారులను ఉద్దేశించి టెలికాం ఆపరేటర్లకు ఓ సూచన చేసింది.ఈ లాక్‌డౌన్‌ సమయంలో కస్టమర్లకు అంతరాయం లేని సేవలు అందించాలని కోరింది. ప్రీపెయిడ్‌ కస్టమర్లకు ప్రస్తుతం ఉన్న వాలిడిటీని పెంచాలని కోరింది. ప్రీపెయిడ్‌ సర్వీసుల కోసం లాక్‌డౌన్‌ సమయంలో రీఛార్జి వోచర్లు, పేమెంట్స్‌ ప్రక్రియ కోసం తీసుకున్న చర్యలను వినియోగదారులకు వివరించాలని ఆదేశించింది.