Traffic Rules: ఒక రోజులో ఒకటి కంటే ఎక్కువ చలాన్లు జారీ చేయవచ్చా? నియమాలు ఏం చెబుతున్నాయి?

Traffic Rules: అదేవిధంగా ఒక డ్రైవర్‌ సీటు బెల్ట్ ధరించకుండా మొదటిసారి జరిమానా విధించిన తర్వాత మళ్లీ అదే తప్పు చేసినట్లయితే మళ్లీ చలాన్‌ జారి చేయవచ్చు. అంటే, ఏ సందర్భాలలో చలాన్ రోజుకు ఒకసారి మాత్రమే జారీ చేయబడుతుంది. అలాగే ఏ సందర్భాలలో..

Traffic Rules: ఒక రోజులో ఒకటి కంటే ఎక్కువ చలాన్లు జారీ చేయవచ్చా? నియమాలు ఏం చెబుతున్నాయి?

Updated on: Jul 12, 2025 | 11:49 AM

భారత ప్రభుత్వం రోడ్డుపై డ్రైవింగ్ చేయడానికి అనేక నియమాలను రూపొందించింది. ప్రతి ఒక్కరూ వాటిని పాటించడం తప్పనిసరి. మీరు ఈ నియమాలను పాటించకపోతే, మీరు భారీ జరిమానా చెల్లించాల్సి రావచ్చు.

నియమాలు ఏమి చెబుతున్నాయి:

ఒక డ్రైవర్ ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించినప్పుడు అతనికి ట్రాఫిక్ పోలీసుల సహాయంతో లేదా రోడ్డుపై ఏర్పాటు చేసిన కెమెరాల సహాయంతో చలాన్ జారీ చేస్తారు. డిజిటల్ చలాన్ సౌకర్యం కారణంగా ఈ ప్రక్రియ మరింత వేగవంతం అయింది. కానీ చాలా మందికి ఒకసారి చలాన్ జారీ చేస్తే అదే రోజున మళ్ళీ చలాన్ జారీ చేయకూడదనే ఒక అపోహ ఉంది.

ఇది కూడా చదవండి: Air India Crash: విమానం అందుకే కూలిపోయింది.. అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంపై సంచలన నివేదిక!

రోజు మొత్తంలో ఒక్కసారి మాత్రమే చలాన్ జారీ చేయవచ్చా?

ఒకే నియమాన్ని ఉల్లంఘించినందుకు రోజుకు ఒకసారి మాత్రమే చలాన్ జారీ చేయవచ్చా? మోటారు వాహన చట్టంలో కొన్ని నియమాలు ఉన్నాయి. వీటికి రోజుకు ఒకసారి ఉల్లంఘిస్తేనే చలాన్ జారీ చేయబడుతుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి హెల్మెట్ లేకుండా బైక్‌పై వెళ్లినప్పుడు ఒకసారి జరిమానా విధిస్తారు. అదే రోజు మళ్ళీ హెల్మెట్ ధరించనందుకు చలాన్ జారీ చేయరు.

ఈ పొరపాటు చేస్తే పదేపదే జరిమానా

ట్రాఫిక్‌ నిబంధనలలో కొన్ని పాటించకపోతే ఒకే రోజులో మీకు అనేకసార్లు చలాన్ జారీ అవుతుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి అతివేగంతో వాహనం నడిపి చలాన్ పొంది కొన్ని గంటల తర్వాత మళ్ళీ వేగ పరిమితిని దాటితే, అతను మళ్ళీ చలాన్ పొందే అవకాశం ఉంది. దీనికి కారణం ఈ తప్పు మళ్లీ పునరావృతం కావడం వల్ల చలాన్‌ జారీ చేయవచ్చు.

అదేవిధంగా ఒక డ్రైవర్‌ సీటు బెల్ట్ ధరించకుండా మొదటిసారి జరిమానా విధించిన తర్వాత మళ్లీ అదే తప్పు చేసినట్లయితే మళ్లీ చలాన్‌ జారి చేయవచ్చు. అంటే, ఏ సందర్భాలలో చలాన్ రోజుకు ఒకసారి మాత్రమే జారీ చేయబడుతుంది. అలాగే ఏ సందర్భాలలో పదేపదే జారీ చేస్తారు అనే నిబంధనలపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల, రోడ్డుపై డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, ప్రతి నియమ ఉల్లంఘనను భిన్నంగా పరిగణిస్తారని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. నియమాల గురించి సరైన సమాచారం కలిగి ఉండటం ద్వారా, మీరు జరిమానాను నివారించడమే కాకుండా, మీరు రోడ్డుపై సురక్షితంగా కూడా ఉండవచ్చు.

ఇది కూడా చదవండి: School Holidays: ఇక ఆ వారంలో వరుసగా 2 రోజుల సెలవులు.. తెరపైకి సరికొత్త డిమాండ్‌

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి