నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌లో సాంకేతిక లోపం.. నిఫ్టిలో నిలిచిపోయిన ట్రేడింగ్.. టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్ల ద్వారా సేవలు

|

Feb 24, 2021 | 12:53 PM

నేషనల్‌ స్టాక్‌ ఎక్స్‌ఛేంజ్‌(ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీలో ట్రేడింగ్‌ నిలిచిపోయింది. సాంకేతిక కారణాల వల్ల క్రమ విక్రయ లావాదేవీలు నిలిపివేసినట్లు నిఫ్టి పేర్కొంది.

నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌లో సాంకేతిక లోపం.. నిఫ్టిలో నిలిచిపోయిన ట్రేడింగ్.. టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్ల ద్వారా సేవలు
Follow us on

NSE trading : నేషనల్‌ స్టాక్‌ ఎక్స్‌ఛేంజ్‌(ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీలో ట్రేడింగ్‌ నిలిచిపోయింది. సాంకేతిక కారణాల వల్ల క్రమ విక్రయ లావాదేవీలు నిలిపివేసినట్లు నిఫ్టి పేర్కొంది. లైవ్‌లో ప్రైస్‌ కోట్స్‌ అప్‌డేట్‌ కావడం లేదని అధికారులు వెల్లడించారు. అందుచేత నిఫ్టీ 50, నిఫ్టీ బ్యాంక్‌ సహా మరికొన్ని సూచీలు పూర్తిగా స్తంభించిపోయాయని తెలిపారు. దీంతో అన్ని రంగాల్లో ట్రేడింగ్‌ను ఉదయం 11:40 గంటల నుంచి నిలిపివేస్తున్నట్లు ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ఎక్స్‌ఛేంజ్‌కి రెండు టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్లు సేవలు అందిస్తున్నాయని.. వారితో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. సమస్య పరిష్కారం అయిన వెంటనే ట్రేడింగ్‌ను పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు.


ట్రేడింగ్‌ ఆగిపోయే సమయానికి నిఫ్టీ 112 పాయింట్ల లాభంతో 14,820 వద్ద కొనసాగుతుంది. మరోవైపు సెన్సెక్స్‌ ట్రేడింగ్‌ ఎలాంటి అంతరాయాలు లేకుండా కొనసాగుతోంది. మధ్యాహ్నం 12:26 గంటల సమయానికి సెన్సెక్స్‌ 239 పాయింట్లు ఎగబాకి 49,990 వద్ద ట్రేడవుతోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బజాజ్‌ ఫినాన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి.