Tomato Prices: మరో రెండు నెలల వరకు టమాటా ధరలు తగ్గవట.. కిలో రూ.300 వరకు చేరవచ్చు

|

Jul 19, 2023 | 4:00 AM

టమాట ధరలు తగ్గుముఖం పడతాయా అని ఎదురుచూస్తున్న కోట్లాది మందికి ఆందోళన కలిగించే వార్త. ఇప్పుడు టమోటా రుచిని రుచి చూడాలంటే ప్రజలు కొన్ని రోజుల పాటు అధికంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం దేశంలో టమాట ధరలు తగ్గే..

Tomato Prices: మరో రెండు నెలల వరకు టమాటా ధరలు తగ్గవట.. కిలో రూ.300 వరకు చేరవచ్చు
Tomato
Follow us on

టమాట ధరలు తగ్గుముఖం పడతాయా అని ఎదురుచూస్తున్న కోట్లాది మందికి ఆందోళన కలిగించే వార్త. ఇప్పుడు టమోటా రుచిని రుచి చూడాలంటే ప్రజలు కొన్ని రోజుల పాటు అధికంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం దేశంలో టమాట ధరలు తగ్గే ఆశాజనకంగా లేదని టమాటా వ్యాపారులు అంటున్నారు. ప్రస్తుతం కిలో టమాట ధర రూ.100పైనే ఉంది.

టమాటా ధరలు తగ్గే ఆశాజనకంగా లేదని నాగ్‌పూర్‌ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌ కమిటీ వ్యాపారి చంద్రమణి బోర్కర్‌ చెబుతున్నారు. అటువంటి పరిస్థితిలో ప్రజలు ఎక్కువ ధరకు కొనుగోలు చేయకతప్పదు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కొద్దిరోజుల్లోనే టమాటా చాలా ఖరీదుగా మారిందని అన్నారు. అయితే దేశవ్యాప్తంగా టమాటా ధరలు భారీగా పెరిగాయి. జూన్ నెలలో టమాటా చాలా చౌకగా ఉందని బోర్కర్ తెలిపారు. అప్పుడు దాని ధర కిలో రూ.40. కానీ జులై మొదటి వారంలోనే కిలో రూ.100కి చేరగా ప్రస్తుతం కిలో టమాటా రూ.200 పలుకుతోంది.

టమాటా ధర కిలో రూ.300

మరోవైపు రుతుపవనాలు ప్రారంభం కావడంతో పలు రాష్ట్రాల్లో అడపాదడపా భారీ వర్షాలు కురుస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో టమోటా పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇలాంటి పరిస్థితుల్లో టమాటా ఉత్పత్తి దెబ్బతినడంతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. రానున్న కొద్ది వారాల్లో టమాటా ధర కిలో రూ.300 వరకు చేరుతుంది. దీని వల్ల ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయికి చేరి సామాన్య ప్రజల బడ్జెట్ పై భారం మరింత పెరిగే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

ఈ విధంగా టమోటా సంవత్సరం పొడవునా సాగు చేయబడుతుంది. కానీ దాని ఉత్పత్తి చక్రం 60 నుంచి 90 రోజులు మాత్రమే. అలాగే టమాటా మొక్కలు నాటిన రెండు మూడు నెలల్లో దీని ఉత్పత్తి ప్రారంభమవుతుంది. వర్షాలు ఇలాగే కురిస్తే ఖరీఫ్ సీజన్‌లో రైతులు టమాట విత్తుకునే పరిస్థితి లేదు.

టొమాటో జూలై-ఆగస్టులో విత్తుతారు

చాలా మంది రైతులు ఖరీఫ్ సీజన్‌లో జూలై, ఆగస్టు నెలల్లో మాత్రమే టమోట విత్తనాలు వేస్తారు. అదే సమయంలో టమోటా పంట ఉత్పత్తి అక్టోబర్ నుంచి ప్రారంభమవుతుంది. ఇది జనవరి నెల వరకు కొనసాగుతుంది. ఈసారి వర్షాల కారణంగా జులై, ఆగస్టు నెలల్లో రైతన్నలు సకాలంలో టమాటా వేయలేకపోతే ధరలు తగ్గేందుకు సమయం పడుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి