ఎండలు ఠారెత్తిస్తున్నాయి. మధ్యాహ్నం అయిందంటే చాలు.. ఇళ్ల దాటి బయటకిపోవాలంటేనే జనాలు దడుసుకుంటున్నారు. ఏ ప్రాంతమైనా సరే.. 45 డిగ్రీలపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ధనికులైతే ఠక్కున ఏసీనో.. కూలరో కొనేస్తారు. కానీ మధ్యతరగతి ప్రజలు అలా కాదు.. వారికి భారంతో కూడుకున్న పని. మరి అలాంటివారి కోసం పోర్టబుల్, మినీ ఏసీలు అందుబాటులోకి వచ్చేశాయి. మీరు కూర్చున్న చోటును క్షణాల్లో చల్లబరుస్తాయి. అందుకే ఈ పోర్టబుల్ ఏసీలకు ఈ-కామర్స్ సైట్లలో భారీ డిమాండ్ ఉంది. ఈ క్రమంలో వచ్చిందే టిపికిల్ మినీ ఎయిర్ కూలర్. దీని ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..
ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో ఈ టిపికిల్ మినీ ఎయిర్ కూలర్ అమ్మకానికి అందుబాటులో ఉంది. ఇది చూసేందుకు చిన్నగా ఉంటుంది. కానీ చిటికెలో ఇల్లంతా మంచు కురుసేలా చేస్తుంది. కేవలం రూ. వెయ్యికే అందుబాటులో ఉన్న ఈ పోర్టబుల్ ఏసీని.. మీ ఇంటిలోనే కాదు.. ఆఫీస్‌లోనూ వినియోగించుకోవచ్చు. ఎయిర్ కూలర్ విండ్‌ను 3 ఇన్ వన్ మోడ్‌తో కంట్రోల్ చేయవచ్చు. మీరు పిక్నిక్‌కి వెళ్లినా కూడా.. ఈ పోర్టబుల్ ఏసీని ఉపయోగించవచ్చు. దీని ఫ్యాన్ రెక్కలను మీరు ఈజీగా క్లీన్ చేయవచ్చు. అలాగే ఈ మినీ కూలర్‌కు యూఎస్బీ అడాప్టర్ ద్వారా చార్జ్ చేయవచ్చు. లేట్ ఎందుకు మీరూ ఈ పోర్టబుల్ ఏసీపై ఓ లుక్కేయండి.(Source)