Top Up loan: టాప్-అప్ లోన్ అంటే ఏమిటి.. ఇది గోల్డ్, పర్సనల్ లోన్ కంటే బెటరా..

|

Jan 28, 2022 | 10:20 PM

శ్రీనివాస్ ఒక ఐటీ నిపుణుడు. ఓ ఎంఎన్‌సీ కంపెనీలో గ‌త ప‌దేళ్లుగా ప‌నిచేస్తున్నాడు. అత‌నికి ఆదాయంలో వార్షికంగా వృద్ధి చెందుతుండ‌టంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంటి రుణం చెల్లిస్తున్నాడు.

Top Up loan: టాప్-అప్ లోన్ అంటే ఏమిటి.. ఇది గోల్డ్, పర్సనల్ లోన్ కంటే బెటరా..
Money
Follow us on

శ్రీనివాస్ ఒక ఐటీ నిపుణుడు. ఓ ఎంఎన్‌సీ కంపెనీలో గ‌త ప‌దేళ్లుగా ప‌నిచేస్తున్నాడు. అత‌నికి ఆదాయంలో వార్షికంగా వృద్ధి చెందుతుండ‌టంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంటి రుణం చెల్లిస్తున్నాడు. అయితే ఇంటిని ఆధునికరించేందుకు మ‌రింత రుణం తీసుకోవాల‌నుకున్నాడు. దానికోసం పర్సనల్ లోన్ లేదా బంగారంపై రుణం తీసుకోవాలి అనకున్నాడు. అయితే ఆర్థిక నిపుణిడిని సంప్రదిస్తే టాప్‌-అప్ లోన్ తీసుకోమ‌ని సూచించాడు. మ‌రి ఇత‌ర రుణాల కంటే టాప్-అప్‌లోన్ తీసుకువ‌డం మేలా? అయితే ఎందుకో చూద్దాం..

టాప్ అప్ లోన్ పేరులో ఉన్నట్లు ఇప్పటికే రుణం తీసుకుని ఉండే దానిపై అద‌నంగా రుణం పొంద‌టాన్ని టాప్ అప్ లోన్ అంటారు. ఇదేలా సాధ్యమంటే ఒక సారి రుణం తీసుకున్నాక మ‌ళ్లీ రుణం తీసుకుందాం అంటే కుదురుతుందా! అది మీ అవ‌స‌రం బ‌ట్టి ఉంటుంది. త‌ప్పని ప‌రిస్థితుల్లో రుణం తీసుకోవాల‌నుకుంటే మాత్రం టాప్ అప్ లోన్ తీసుకోవ‌చ్చు. ఎందుకంటే ఇందులో గృహ‌రుణానికి వ‌ర్తించే వ‌డ్డీ రేటు ఆధారంగా ఉంటుంది. కాబ‌ట్టి ఎలా చూసినా టాప్ అప్ లోన్ , ప‌ర్సన‌ల్ లోన్ కంటే బెటర్.

దాదాపు అన్ని బ్యాంకులు ఈ స‌దుపాయాన్ని క‌లిపిస్తున్నాయి. గృహ రుణం చెల్లించడం మొదలైన 6 -12 నెల‌ల‌కు టాప్ అప్ లోన్ తీసుకునేందుకు అవ‌కాశం క‌లిపిస్తున్నాయి. ఇంటికి చాలా లోన్ తీసుకున్నాం క‌దా మ‌ళ్లీ లోన్ కావాలంటే బ్యాంకులు ఇస్తాయా అనే సందేహం వ‌స్తుంది. అయితే ఇక్కడ లాజిక్ గ‌మ‌నిస్తే మీకు విష‌యం వివ‌రంగా అర్థమ‌వుతుంది.
ఇదెలా అంటే మొత్తం తీసుకున్న గృహ‌రుణం నుంచి త‌గ్గిన రుణాన్ని తీసివేస్తే వ‌చ్చే మొత్తానికి టాప్ అప్ లోన్ ఇస్తారు. తీసుకున్న రుణం నుంచి ఎంత ఎక్కువ‌గా ఇంటికి వినియోగిస్తే అంత ప‌న్ను ప్రయోజ‌నం ఎక్కువ‌గా ఉంటుంది. సెక్షన్ 80 సీ కింద మొత్తం రుణంపై వ‌డ్డీ చెల్లింపుపై కూడా మిన‌హాయింపు ఉంటుంది.

Read Also.. Inequality: ఇండియాలో పెరిగిన ఆర్థిక అసమానత.. బిలియనీర్లలో మూడో స్థానంలో ఉన్న దేశం..