జూలై భారతదేశంలో కార్లు, బైక్‌ల ఔత్సాహికులను అలరించనుంది. ముఖ్యంగా జూలై నెలలోనే ప్రిమియం కంపెనీలకు చెందిన కార్లు, బైక్‌లు లాంచ్ చేయనున్నారు. ముఖ్యంగా బెంజ్, బీఎండబ్ల్యూ లగ్జరీ కార్ల తయారీదారుల నుంచి బజాజ్ ఆటో వంటి కంపెనీలు కార్లు, బైక్‌లు లాంచ్ చేయనున్నారు. ముఖ్యంగా ప్రీమియం కార్లు, బైక్‌లు కొనుగోలు చేయాలనుకునే వారు ఓ నెల రోజులు ఆగి కొనుగోలు చేయడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. అలాగే బెంజ్, బీఎండబ్ల్యూ వాహన ప్రియులను ఆకట్టుకునేలా వచ్చే నెలలో రిలీజయ్యే వాహనాల గురించి ఓ సారి తెలుసుకుందాం.
మెర్సిడీస్ బెంజ్ జూలై 8, 2024న ఈక్యూఏ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీను పరిచయం చేస్తుందని మార్కెట్ నిపుణులు చెబతున్నారు. ఈక్యూఎస్, ఈక్యూఈ, ఈక్యూబీ ఎస్‌యూవీల తర్వాత ఈ మోడల్ భారతదేశంలో నాలుగో ఈవీగా ఈ ఎస్‌యూవీను లాంచ్ చేస్తుంది. ఈక్యూఏ రెండు సెట్ల బ్యాటరీ ప్యాక్స్‌తో వస్తుందని భావిస్తున్నారు. 66.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఒకే ఛార్జ్ 528 కిమీల పరిధిని అందిస్తుంది. అయితే పెద్ద 70.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ 560 కిమీల పరిధిని క్లెయిమ్ చేస్తుంది. ఈక్యూఏ ఎస్‌యూవీ 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి అదనపు ఫీచర్లతో పాటు సరికొత్త ఎంబీయూఎక్స్ యూజర్ ఇంటర్ ఫేస్‌తో రన్ అయ్యే స్టైలింగ్ అప్డేట్లతో అందరినీ ఆకర్షిస్తుంది.
బీఎండబ్ల్యూ భారతదేశంలో కొత్త తరం 5 సిరీస్ లాంగ్ వీల్ బేస్ కోసం బుకింగ్స్‌ను ప్రారంభించింది. జూలై 24, 2024న ఈ కారును లాంచ్ చేయనున్నారు. ముఖ్యంగా ఈ కారు ప్రపంచవ్యాప్తంగా రైట్-హ్యాండ్ డ్రైవ్ ఏకైక దేశంగా భారతదేశం నిలనుంది. ఈ కారు మెర్సిడెస్ ఈ-క్లాస్ ఎల్‌డబ్ల్యూబీ కంటే పెద్దదిగా ఉంటుంది. 5,175 ఎంఎం పొడవు, 1,900 ఎంఎం వెడల్పు, 1,520 ఎంఎం ఎత్తుతో వస్తుంది. వీల్ బేస్ ప్రామాణిక వీలే బేస్ మోడల్ కంటే 3,105 ఎంఎం, 110 ఎంఎం పొడవు ఉంటుంది. 5 సిరీస్ ఎల్‌డబ్ల్యూబీ పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో వస్తుంది. కొత్త 48 వోల్ట్ మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీతో 2.0 లీటర్ పెట్రోల్, డీజిల్ యూనిట్లను పొందే అవకాశం ఉంది.
బీఎండబ్ల్యూ యాజమాన్యంలోని మినీ కూడా జూలై 24న రెండు కొత్త కార్లను విడుదల చేయనుంది. మినీ ఇండియా తన రాబోయే కొత్త-తరం కూపర్ ఎస్, కంట్రీమ్యాన్ ఈ మోడల్స్‌ను లాంచ్ చేయనుంది. కూపర్ ఎస్ 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆధారంగా పని చేస్తుంది ఇది 201 బీహెచ్‌పీ, 300 ఎన్ఎం గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది ఈ కారు 6.6 సెకన్లలో 0-100 కేఎంపీహెచ్ వేగాన్ని అందుకుంటుంది. అలాగే 7 స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్‌తో ఆకట్టుకుంటుంది. రీడిజైన్ చేసిన గ్రిల్, మూడు అనుకూలీకరించదగిన సిగ్నేచర్ ఎల్ఈడీ డీఆర్ఎల్‌లతో రౌండ్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్లు, యూనియన్ జాక్-థీమ్ టెయిల్ లైట్లు ఆకర్షణీయంగా ఉంటుంది.
మినీ కంట్రీమ్యాన్ సరికొత్త ఎల్ఈడీ డీఆర్ఎల్‌లు, బోల్డర్ గ్రిల్‌తో ఆకర్షణీయమైన డిజైన్‌తో వస్తుంది. ఈ ఈవీకి శక్తినిచ్చే ఎలక్ట్రిక్ మోటార్ 201 బీహెచ్‌పీ శక్తిని, 250 ఎన్ఎం గరిష్ట టార్క్ ను 0-100 కిలో మీటర్ల వేగాన్ని 8.6 సెకన్లలో అందుకోగలదు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 462 కిమీల వరకు పరిదిని అందిస్తుంది. ఈవీలో లెవెల్ 2 ఏడీఏఎస్, మినీ కనెక్టెడ్ టెక్, డిజిటల్ కీ ప్లస్, ఫిష్ ఐ ఇన్-కార్ కెమెరా, మసాజ్ ఫంక్షన్‌తో పాటు ఎలక్ట్రికల్‌గా అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు వంటి ఇతర అదనపు ఫీచర్లు కూడా ఉంటాయి.
జూలై 5న బజాజ్ తన సీఎన్‌జీ మోటార్ సైకిలు భారతదేశంలో విడుదల చేయనుంది. ప్రపంచంలో ఎక్కడా లేని మొదటి మోడల్. బజాజ్ ఆటోలో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ తో కలిసి రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ సమక్షంలో ఈ మోటార్ సైకిల్‌ను విడుదల చేయనున్నారు. దీని అధికారిక పేరు ఇంకా ధృవీకరించబడనప్పటికీ సీఎన్‌జీ బైక్ 100-150 సీసీ విభాగంలో బజాజ్ మోటార్ సైకిల్‌పై ఆధారపడి ఉంటుందని భావిస్తున్నారు. ఈ బజాజ్ పెట్రోల్ ట్యాంక్ లతో కూడిన డ్యూయల్ ఫ్యూయల్ ట్యాంకులతో వస్తాయి. ఏఏ ఫ్లాట్ సింగిల్ సీటు, సీఎన్‌జీ ట్యాంక్ కోసం ఒక మూత ఉంటుంది. సీఎన్‌జీ మోటార్ సైకిల్ మోడల్ రన్నింగ్ ధరను 50 శాతం తగ్గించడంలో సహాయపడుతుందని బజాజ్ పేర్కొంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..