Budget Cars: కొత్త కారు కొనే ప్లాన్‌లో ఉన్నారా.? తక్కువ బడ్జెట్‌లో ఉన్న కార్లు ఇవే..

ఒకప్పుడు కారు అంటే అదొక విలాసవంతమైన వస్తువుగా భావించే వారు. కానీ ప్రస్తుతం కారు కూడా నిత్యవసర వస్తువుగా మారిపోయింది. కంపెనీలు తక్కువ ధరకు కార్లను అందుబాటులోకి తీసుకొస్తుండడం, బ్యాంకులు కూడా ఆకర్షణీయమైన కారు లోన్‌లను అందిస్తుండడంతో చాలా మంది కొత్త కారు కలను నిజం చేసుకుంటున్నారు. ఇక మధ్య తరగతి కుటుంబాలకు కూడా నేరు కారు అందుబాటులోకి వచ్చేసింది....

Budget Cars: కొత్త కారు కొనే ప్లాన్‌లో ఉన్నారా.? తక్కువ బడ్జెట్‌లో ఉన్న కార్లు ఇవే..
Cars

Updated on: Apr 30, 2024 | 4:16 PM

ఒకప్పుడు కారు అంటే అదొక విలాసవంతమైన వస్తువుగా భావించే వారు. కానీ ప్రస్తుతం కారు కూడా నిత్యవసర వస్తువుగా మారిపోయింది. కంపెనీలు తక్కువ ధరకు కార్లను అందుబాటులోకి తీసుకొస్తుండడం, బ్యాంకులు కూడా ఆకర్షణీయమైన కారు లోన్‌లను అందిస్తుండడంతో చాలా మంది కొత్త కారు కలను నిజం చేసుకుంటున్నారు. ఇక మధ్య తరగతి కుటుంబాలకు కూడా నేరు కారు అందుబాటులోకి వచ్చేసింది. తక్కువ ధరలోనే కార్లు మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. అది కూడా నెలనెలకు ఎలాంటి భారం లేకుండా ఈఎమ్‌ఐ చెల్లించే విధానంలో కారు లోన్‌లను అందిస్తున్నారు. మరి ప్రస్తుతం మార్కట్లో రూ. 5 లక్షల రేంజ్‌లో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ కార్లు ఏంటి.? వాటిలో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

* మార్కెట్లో తక్కువ ధరలో అందుబాటులో ఉన్న కార్లలో మారుతి సుజికీ ఎస్‌ ప్రెస్సో ఒకటి. ఈ కారును తక్కువ ధరలోనే సొంతం చేసుకోవచ్చు. 5 సీటింగ్ కెపాసిటీతో వచ్చే ఈ కారు ఎక్స్‌ షోరూమ్‌ ధర రూ. 4.26 నుంచి ప్రారంభమవుతుంది. ఇక మైలేజ్‌ విషయంలో కూడా ఈ కారు బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఈ కారు ఏకంగా లీటర్‌కు 25.3 కీలోమీటర్లు ఇస్తుండడం విశేషం. ఇక ఇందులో పెట్రోల్‌, సీఎన్జీ ఆప్షన్స్‌లో తీసుకొచ్చారు.

* రూ. 5 లక్షల లోపు అందుబాటులో ఉన్న మరో బెస్ట్‌ కారు రెనాల్ట్‌ క్విడ్‌ ఒకటి. ఈ కారు ధర ఎక్స్‌ షోరూమ్‌ రూ. 4.69 లక్షలుగా ఉంది. ఈ కారు లీటర్‌కు 22 కిలోమీటర్ల మైలేజ్‌ ఇస్తుంది. ఇక లుక్స్‌ విషయంలో ఈ కారు చాలా బాగుంది. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 20.32 సెంటీమీటర్లతో కూడిన టచ్‌ స్క్రీన్‌ను అందించారు. ఆండ్రాయిడ్‌ ఆటోతోపాటు, యాపిల్‌ కార్‌ ప్లేకి ఇది సపోర్ట్‌ చేస్తుంది. డ్యూయల్ ఎయిర్‌ బ్యాగ్స్‌ అందించారు.

* తక్కువ ధరలో అందుబాటులో ఉన్న మరో బెస్ట్‌ కార్‌ విషయానికొస్తే ఆల్టో కే10. గతేడాది విడుదలైన ఈ కారు సేల్స్ బాగున్నాయి. ఈ కారు ఎక్స్‌ షోరూమ్‌ ధర రూ. 4 లక్షలకుపైమాటే. ఇందులో సీఎన్జీ మోడల్‌ కూడా అందుబాటులో ఉంది. ఇందులో కూడా అన్ని రకాల అధునాత ఫీచర్లను అందించారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..