Top Mileage Cars: భారతదేశంలో అత్యధిక మైలేజ్ ఇచ్చే టాప్ 10 కార్లు!

|

May 13, 2024 | 5:18 PM

వాహన నిర్వహణ ఖర్చులలో ఇంధన సామర్థ్యం అత్యంత ముఖ్యమైన అంశమనే విషయం అందరికి తెలిసిందే. కొంత మంది కస్టమర్లు తమ ప్రాధాన్యతలను బట్టి హై-ఎండ్ కార్లను కొనుగోలు చేసినప్పటికీ, సాధారణ వినియోగదారులు ధర, మంచి ఇంధన సామర్థ్యంపై ఎక్కువ దృష్టి పెడతారు. అందుకే సరసమైన ధరలో భారతదేశంలో కొనుగోలు చేయగల ఉత్తమ మైలేజ్ కార్ల గురించి తెలుసుకుందాం..

Top Mileage Cars: భారతదేశంలో అత్యధిక మైలేజ్ ఇచ్చే టాప్ 10 కార్లు!
High Mileage
Follow us on

వాహన నిర్వహణ ఖర్చులలో ఇంధన సామర్థ్యం అత్యంత ముఖ్యమైన అంశమనే విషయం అందరికి తెలిసిందే. కొంత మంది కస్టమర్లు తమ ప్రాధాన్యతలను బట్టి హై-ఎండ్ కార్లను కొనుగోలు చేసినప్పటికీ, సాధారణ వినియోగదారులు ధర, మంచి ఇంధన సామర్థ్యంపై ఎక్కువ దృష్టి పెడతారు. అందుకే సరసమైన ధరలో భారతదేశంలో కొనుగోలు చేయగల ఉత్తమ మైలేజ్ కార్ల గురించి తెలుసుకుందాం.

టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా

హైరైడర్, గ్రాండ్ విటారా ఎస్‌యూవీలు ప్రస్తుతం భారతదేశంలో అత్యధిక మైలేజీతో అందుబాటులో ఉన్న అత్యంత సరసమైన కారు మోడల్‌లు. టయోటా, మారుతి సుజుకి భాగస్వామ్యంతో నిర్మించబడిన ఈ రెండు కార్లు పెట్రోల్, హైబ్రిడ్ వేరియంట్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. ఇందులో హైబ్రిడ్ వేరియంట్‌లు లీటర్ పెట్రోల్ కాంబినేషన్‌కు 27.93 కిమీ మైలేజీని అందిస్తాయి.

ఇవి కూడా చదవండి

హోండా సిటీ సెడాన్

సిటీ సెడాన్ కార్ మోడల్ మంచి ఇంధన సామర్థ్యం కలిగిన కార్ల జాబితాలో అగ్రస్థానంలో ఉంది మరియు ఇది కస్టమర్ ప్రాధాన్యత ప్రకారం పెట్రోల్ మరియు హైబ్రిడ్ వెర్షన్‌లలో కూడా అందుబాటులో ఉంది. సిటీ హై-ఎండ్ మోడల్‌లోని హైబ్రిడ్ మోడల్ పెట్రోల్ కలయికతో 27.13 kmpl మైలేజీని అందిస్తుంది మరియు ఆకర్షణీయమైన ధరతో ఉంటుంది.

మారుతీ సుజుకి స్విఫ్ట్, సెలెరియో

అప్‌డేట్‌ చేసిన స్విఫ్ట్ కారు ఇటీవల ప్రారంభించింది. ఇది 1.2 లీటర్ Z12E పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో ఉంటుంది. ఇది తక్కువ ఆర్‌పీఎం వద్ద కూడా శక్తివంతమైన పనితీరును అందిస్తుంది. ఇది సిటీ డ్రైవింగ్‌కు చాలా సహాయకారిగా ఉంటుంది. అలాగే అధిక ఇంధన సామర్థ్యాన్ని నిర్ధారిస్తుంది. ఇందులోని మ్యాన్యువల్ మోడల్ 24.8 kmpl మైలేజీని ఇవ్వగా, ఆటోమేటిక్ మోడల్ 25.75 kmpl మైలేజీని ఇస్తుంది. అలాగే 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ కలిగిన సెలెరియో కారు 25.96 కి.మీ మైలేజీని ఇస్తుంది.

మారుతి సుజుకి వ్యాగన్ఆర్, ఆల్టో కె10:

చిన్న పరిమాణ కార్లలో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యాగన్ఆర్, ఆల్టో కె10 కూడా ఇంధన సామర్థ్యంపై దృష్టి పెడతాయి. ఇవి వివిధ పెట్రోల్ ఇంజన్‌లతో 24.77 kmpl, 24.65 kmpl మైలేజీని కూడా అందిస్తాయి. అంతేకాకుండా ఇవి సీఎన్‌జీ మోడల్‌లో కొనుగోలు చేయడానికి కూడా అందుబాటులో ఉన్నాయి. తద్వారా ఎక్కువ మైలేజీని ఆశించవచ్చు.

మారుతి సుజుకి బాలెనో, డిజైర్

అత్యధిక మైలేజ్ ఇచ్చే కార్లలో మారుతి సుజుకి కార్లు బాలెనో, డిజైర్‌లలో ప్రముఖమైనవి. ఈ కార్లు మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో 23.69 kmpl నుండి 22.64 kmpl మైలేజీని అందిస్తాయి.

మారుతి సుజుకి ఫ్రాంక్స్ మరియు టయోటా టైసర్

Franks, Tisser కార్లు కూడా చాలా ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ రెండు కార్లు ఒకే ఇంజన్ ఆప్షన్లు కలిగి ఉంటాయి. రెగ్యులర్ పెట్రోల్, టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లతో ఉన్న ఫ్రాంక్స్, టిస్సర్స్ 22.34 kmpl మైలేజీని అందిస్తాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి