Gold: స్వచ్ఛమైన పసిడి ధరలు తగ్గాయ్.. తాజా బంగారం, వెండి రేట్లు చూశారా..?

గత కొద్దిరోజులుగా కొండెక్కి కూర్చున్న బంగారం ధరలు కొద్ది కొద్దిగా నేలచూపులు చూస్తున్నాయి. ప్రపంచ మార్కెట్‌ ప్రభావంతో భారత్‌ బులియన్‌ మార్కెట్లో బంగారం ధరల్లో మార్పు చోటు చేసుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఒక ఔన్సు (31.10 గ్రాములు)లకు గ్లోబల్ మార్కెట్లో 15 డాలర్ల వరకు తగ్గి 2935 డాలర్ల వద్దకు దిగివచ్చింది.

Gold: స్వచ్ఛమైన పసిడి ధరలు తగ్గాయ్.. తాజా బంగారం, వెండి రేట్లు చూశారా..?
Gold

Updated on: Feb 23, 2025 | 8:50 AM

అతివల మదిని దోచే ఆభరణాలు.. స్వర్ణకాంతులే..! కానీ.. ఆ స్వర్ణం.. ఇప్పుడు కొనే స్థితిలో లేకుండా.. పరుగులు పెడుతోంది. ఆకాశమే హద్దుగా పెరిగిపోతోంది పసిడి ధర.. అయితే పసిడి ప్రియులకు ఇది కాస్త ఊరటనిచ్చే విషయమే..బంగారం పసిడి ధరలు తగ్గాయి అండోయ్. ఇటీవలి వరకు బంగారం ముట్టుకుంటే ఒట్టేనన్నట్టుండేది. 90 వేలు ఎప్పుడు టచ్ చేద్దామా అని ఆవురావురుమంటుంది గోల్డ్. పెళ్ళిళ్ళు… పండుగలు…శుభకార్యం ఏదైనా భారతీయుల ఇంట బంగారం ఉండాల్సిందే. అలాంటిది ఆకాశాన్నంటుతోన్న ధరలు ఆ మాటెత్తకుండా చేశాయి. ఇప్పటి వరకు పైపైకి ఎగిసిన పసిడితల్లి ఇప్పుడిప్పుడే కొద్దిగా డౌన్ అవుతుంది. గత రెండు రోజులుగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి.

హైదరాబాద్‌ మార్కెట్లో స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర క్రితం రోజుతో పోలిస్తే 10 గ్రాములపై రూ.330 మేర తగ్గింది. దీంతో ఆదివారం, ఫిబ్రవరి 23 తులం రేటు రూ. 87,770 వద్ద ట్రేడవుతుంది. ఇక 22 క్యారెట్ల జ్యూయలరీ గోల్డ్ రేటు మళ్లీ పెరిగింది. క్రితం రోజుతో పోలిస్తే ఇవాళ 10 గ్రాములపై రూ. 200 పెరిగి రూ. 80 వేల 450 వద్దకు చేరింది.

విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22 క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.80,450 కాగా.. 24 క్యారట్ల ధర రూ.87,770 వద్ద కొనసాగుతుంది.

హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు రూ.1,07,000గా ఉంది. కాగా ఇవి ఉదయం తీసుకున్న డేటా. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి