Gold Price Today : గత కొన్ని రోజులుగాతగ్గిన పసిడి ధరలు.. భారీగా పెరిగిన కొనుగోళ్లు.. దీంతో ఈరోజు పసిడి ధరఎలా ఉందో తెలుసా..!

|

Feb 24, 2021 | 7:40 AM

బడ్జెట్ లో బంగారం పై దిగుమతి సుంకాన్ని తగ్గించిన తర్వాత పసిడి ధరలు గణనీయంగా దిగివచ్చాయి. గత కొని రోజులుగా క్రమంగా బంగారం ధర తగ్గుముఖం పట్టడంతో దేశీయంగా భారీ ఎత్తున కొనుగోలు మొదలయ్యాయి...

Gold Price Today : గత కొన్ని రోజులుగాతగ్గిన పసిడి ధరలు.. భారీగా పెరిగిన కొనుగోళ్లు.. దీంతో ఈరోజు పసిడి ధరఎలా ఉందో తెలుసా..!
Follow us on

 Gold Rate Today (24-02-2021) : బడ్జెట్ లో బంగారం పై దిగుమతి సుంకాన్ని తగ్గించిన తర్వాత పసిడి ధరలు గణనీయంగా దిగివచ్చాయి. గత కొని రోజులుగా క్రమంగా బంగారం ధర తగ్గుముఖం పట్టడంతో దేశీయంగా భారీ ఎత్తున కొనుగోలు మొదలయ్యాయి.అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ, దేశీయంగా ధరలు తగ్గుముఖం పట్టడం విశేషం.

దేశీయంగా మార్కెట్లు పుంజుకోవడంతో పసిడి రేటు తగ్గింది. అయితే మార్కెట్ లో కొనుగోలు పెరగడంతో మళ్ళీ కొద్దిమేర బంగారం ధర పెరిగింది. తాజాగా ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. పెరిగిన ధరల ప్రకారం ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 590 పెరిగి రూ. 43,850లకు చేరుకుంది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.650 పెరిగి రూ.47,840కి చేరింది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 43,850గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,840గా ఉంది.ఇక దేశ వ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..!

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,950గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 46,950గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,000గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,180గా ఉంది.

Also Read:

ఈ రోజు షేర్స్, పెట్టుబడులు ఏ రాశివారికి లాభాలను ఇస్తుందో తెలుసా..! ఏ దేవుడిని పూజించాలంటే..!