Petrol, Diesel Price Today: దేశంలో స్థిరంగా పెట్రోల్, డీజిల్‌ ధరలు.. ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే..

|

Jun 23, 2022 | 9:21 AM

దేశంలో పెట్రోల్, డీజిల్‌ ధరలు స్థరంగా ఉన్నాయి. అటు అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గుముఖం పట్టాయి...

Petrol, Diesel Price Today: దేశంలో స్థిరంగా పెట్రోల్, డీజిల్‌ ధరలు.. ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే..
Follow us on

దేశంలో పెట్రోల్, డీజిల్‌ ధరలు స్థరంగా ఉన్నాయి. అటు అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశంలో చివరిసారిగా మే 21న పెట్రోల్, డీజిల్‌పై విధించే ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మే 22న దేశవ్యాప్తంగా చమురు ధరల్లో చివరి మార్పు జరిగింది. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోలు ధర రూ.111.35 కాగా, డీజిల్ ధర రూ.97.28గా ఉంది. మరోవైపు చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.102.63, డీజిల్ రూ.94.24గా విక్రయిస్తున్నారు. అదే సమయంలో కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.106.03, డీజిల్ ధర లీటరుకు రూ.92.76గా ఉంది.

దేశంలోని పలు ప్రాంతాల్లో డీజిల్‌ కొరత ఉన్నట్లు తెలుస్తుంది. కంపెనీలు బంక్‌లకు ఎక్కువ సరఫరా చేయకపోవడం వల్లే కొరత ఏర్పడుతున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుత ధరకు అమ్మితే నష్టాలు వస్తున్నాయని అందుకే సరఫరా తక్కువ చేస్తున్నట్లను వార్తలు వస్తున్నాయి. దీంతో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ షేర్లు ప్రస్తుతం 52 వారాల కనిష్ట స్థాయి వద్ద ట్రేడవుతున్నాయి. హైదరాబాద్‌లో ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇక్కడ గురువారం పెట్రోల్‌ రేట్‌ రూ. 109.64గా ఉండగా, డీజిల్‌ రూ. 97.8 వద్ద కొనసాగుతోంది. కరీంనగర్‌లో లీటర్‌ పెట్రోల్ రూ.109.64 ఉండగా డీజిల్‌ లీటర్‌కు రూ.97.82గా ఉంది. ఏపీలోని విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ రూ. 111.74గా ఉండగా, డీజిల్‌ రూ. 99.49వద్ద కొనసాగుతోంది.