Gold Rates Today: బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఇదే సరైన సమయమని చెప్పాలి. మారుతోన్న ట్రెండ్ చూస్తుంటే ఇదే సూచనలు కనిపిస్తున్నాయి. పండుగలో నేపథ్యంలో బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు క్రమంగా పెరగుతూ వస్తున్నాయి. పండుగలకు శుభకార్యక్రమాలు కూడా తోడు కావడంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా గురువారం బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. నేడు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో తులం బంగారం రేటు ఎంత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
* దేశ రాజధాని న్యూఢిల్లీలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 50,840 గా ఉండగా, 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 46,600 వద్ద కొనసాగుతోంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో బంగారం ధరలో కాస్త తగ్గుదల కనిపిపించింది. ఇక్కడ 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రూ. 47,490 కాగా, 22 క్యారెట్ల గోల్డ్ రూ. 46,490గా ఉంది.
* తమిళనాడు రాజధాని చెన్నైలో గురువారం 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 48,810, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,740 గా నమోదైంది.
* కర్ణాటక రాజధాని బెంగళూరులో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 48,490 గా ఉండగా, 22 క్యారెట్ల గోల్డ్ రూ. 44,450 వద్ద కొనసాగుతోంది.
* హైదరాబాద్‌లో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 48,490 కాగా, 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 44,450గా ఉంది.
* విజయవాడలో కూడా బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. ఇక్కడ గురువారం 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 48,490 పలకగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 44,450 గా ఉంది.
* విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం రూ. 48,490 గా ఉండగా, 22 క్యారెట్ల గోల్డ్ రూ. 44,450 వద్ద ఉంది.
Lion vs Cheetah: సింహానికి చుక్కలు చూపించిన చిరుత పులి.. భయంతో పరుగులు తీసిన అడవిరాజు..
TDP vs YCP: మంగళగిరి టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు దీక్ష.. అనుమతి ఇచ్చిన పోలీసులు..