కన్‌ఫ్యూజ్ చేస్తున్న బంగారం ధర.. ఏం జరుగుతుందంటే ?

| Edited By: Rajesh Sharma

Oct 16, 2019 | 10:19 AM

పసిడి ధరలు పరుగులు పెడుతోంది. హైదరాబాద్‌ మార్కెట్లో బుధవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర స్వల్పంగా రూ.350 పెరిగింది. దీంతో.. బంగారం మళ్లీ 40 వేల మార్క్‌ను దాటి ప్రస్తుతం.. రూ.40,050కి చేరింది. అలాగే.. 22 క్యారెట్ల బంగారు ఆభరణాల ధర రూ.320లు పెరిగి రూ.36,720కు చేరింది. దీపావళి తరువాత పెళ్లిళ్లకు ముహుర్తాలు ఉన్న కారణంగా.. బంగారు ప్రియులు ఇప్పటి నుంచే కొనుగోలు చేస్తున్నారు. అలాగే.. అంతర్జాతీయంగా కూడా బలమైన ట్రెండ్ సహా దేశీ […]

కన్‌ఫ్యూజ్ చేస్తున్న బంగారం ధర.. ఏం జరుగుతుందంటే ?
Follow us on

పసిడి ధరలు పరుగులు పెడుతోంది. హైదరాబాద్‌ మార్కెట్లో బుధవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర స్వల్పంగా రూ.350 పెరిగింది. దీంతో.. బంగారం మళ్లీ 40 వేల మార్క్‌ను దాటి ప్రస్తుతం.. రూ.40,050కి చేరింది. అలాగే.. 22 క్యారెట్ల బంగారు ఆభరణాల ధర రూ.320లు పెరిగి రూ.36,720కు చేరింది. దీపావళి తరువాత పెళ్లిళ్లకు ముహుర్తాలు ఉన్న కారణంగా.. బంగారు ప్రియులు ఇప్పటి నుంచే కొనుగోలు చేస్తున్నారు. అలాగే.. అంతర్జాతీయంగా కూడా బలమైన ట్రెండ్ సహా దేశీ బంగారు షాపుల యజమానుల నుంచి డిమాండ్ రావడంతో.. బంగారం ధర ఒక్కసారిగా పెరిగింది.

అయితే.. నిన్న మంగళవారం తగ్గిందనుకున్న పసిడి ధరలు.. ఈరోజు ఒక్కసారిగా.. 40వేల బెంజ్ మార్క్‌ దాటేసరికి కొనుగోలు దారులు కాస్త సతమతమవుతున్నారు. నిన్ననే తగ్గింది అనుకునేసరికి.. ఈరోజు పెరిగింది. దీంతో.. ఒకింత వినియోగదారులు కన్ఫ్యూజన్‌కి గురవుతున్నారు. ఏ రోజు ఎంత పెరుగుతుందో.. ఎంత తగ్గుతుందో అంచనా వేయలేకపోతున్నారు.

కాగా.. పసిడి ధర పెరిగి షాక్‌ ఇస్తుంటే.. వెండి తగ్గి కాస్త.. సంతోషాన్ని కల్గిస్తోంది. తాజాగా.. ఈ రోజు మార్కెట్లో.. కిలో వెండి ధర ఏకంగా రే.1,150 తగ్గింది. దీంతో.. కిలో వెండి ధర రూ.47,500కు దిగొచ్చింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడమే.. వెండి ధర తగ్గడానికి కారణమని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.