Tesla Cars in India: టెస్లాను భారత్‌కు తీసుకురావాలని ఉంది..కానీ, అదే అడ్డంకిగా మారింది అంటున్న ఎలాన్ మస్క్ 

టెస్లా ఎలక్ట్రిక్ కార్లను భారతదేశంలో ప్రారంభించాలని ఉన్నా.. అక్కడి పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవని ఎలాన్ మస్క్ అంటున్నారు.

Tesla Cars in India: టెస్లాను భారత్‌కు తీసుకురావాలని ఉంది..కానీ, అదే అడ్డంకిగా మారింది అంటున్న ఎలాన్ మస్క్ 
Tesla Car In India

Edited By: Janardhan Veluru

Updated on: Jul 24, 2021 | 6:42 PM

Tesla Cars in India: ఎలక్ట్రిక్ కార్ల దిగుమతి సుంకాన్ని తగ్గించాలని కోరుతూ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ భారత ప్రభుత్వానికి లేఖ రాశారు. దిగుమతి సుంకం తగ్గించడం వల్ల కంపెనీ ఎలక్ట్రిక్ కార్లు చౌకగా తయారవుతాయని, ఇది మార్కెట్లో తమ డిమాండ్‌ను పెంచుతుందని, ప్రభుత్వ ఆదాయం కూడా పెరుగుతుందని ఆయన చెప్పారు. అయితే, దేశీయ తయారీని ప్రోత్సహించడానికి అనేక పరిశ్రమలకు అధిక దిగుమతి పన్నులను ప్రభుత్వం సమర్ధించినందు వలన టెస్లా డిమాండ్ పై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాల్సి ఉంది.

ఒక జాతీయ పత్రికలో వచ్చిన ఒక నివేదిక కథనం ప్రకారం, టెస్లా ఈ సంవత్సరం నుండి భారతదేశంలో కార్ల అమ్మకాలను ప్రారంభించనుంది.  ఎలక్ట్రిక్ కార్లపై దిగుమతి సుంకాన్ని  40 శాతానికి తగ్గించడం సముచితమని టెస్లా మంత్రిత్వ శాఖలకు, నీతి ఆయోగ్‌కు రాసిన లేఖలో పేర్కొంది. కాకపోతే టెస్లా ఈ లేఖను బహిరంగపరచలేదు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ దిగుమతి సుంకాన్ని తగ్గించడం అనే విషయంపై స్పందించారు.

ప్రముఖ యూట్యూబర్ మదన్ గౌరీ ట్విట్టర్ లో టెస్లా కార్లను భారత్ కు తీసుకురావాలని చేసిన విజ్ఞప్తిపై ఎలాన్ మస్క్ స్పందించారు.  ”మాకూ భారత్ లో టెస్లాను ప్రవేశపెట్టాలని ఉంది. అయితే, ఇక్కడి దిగుమతి సుంకం ఇబ్బందికరంగా ఉంది. దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం తగ్గిస్తే వెసులుబాటుగా ఉంటుంది.” అని పేర్కొన్నారు. అంతేకాకుండా.. ”భారత్ లో పెట్రలో, డీజిల్ కార్లను చూసినట్టే ఎలక్ట్రిక్ వాహనాలనూ చూస్తున్నారు. కానీ, భారత పర్యావరణానికి ఈ వాహనాలు చేసే మేలు గురించి ఆలోచించడం లేదు.” అంటూ ట్విట్టర్ పై స్పందించారు.

ఆ ట్వీట్ మీరూ చూడండి..

 

ప్రస్తుతం కార్లపై దిగుమతి సుంకం ఇలా..

మన దేశంలో దిగుమతి చేసుకునే కార్లపై దిగుమతి సుంకం ఇలా  ఉంటుంది. 30 లక్షల రూపాయల కన్నా తక్కువ ఖరీదు చేసే కారుపై 60 శాతం దిగుమతి సుంకం విధిస్తారు. అదేవిధంగా, అంతకంటే ఎక్కువ ఖరీదు ఉన్న వాహనాలను దిగుమతి చేసుకుంటే నూరు శాతం దిగుమతి సుంకం చెల్లించాల్సి ఉంటుంది. అయితే, టెస్లా కంపెనీ చెబుతున్నదాని ప్రకారం 40 శాతం దిగుమతి సుంకాన్ని విధిస్తే ఎలక్ట్రిక్ కార్లు మరింత చౌకగా దొరుకుతాయి. డిమాండ్ పెరిగితే కంపెనీలు స్థానికంగా ఉత్పత్తి చేసేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే, ఆ అవకాశం లేదు.

టెస్లా మోడల్ 3 స్టాండర్డ్ రేంజ్ ప్లస్ ధర రూ .30 లక్షలు

టెస్లా యుఎస్ వెబ్‌సైట్ ప్రకారం, ఒక మోడల్ మాత్రమే, అంటే మోడల్ 3 స్టాండర్డ్ రేంజ్ ప్లస్ ధర 40,000 డాలర్ల (సుమారు రూ .30 లక్షలు) కంటే తక్కువ. వాస్తవానికి, ఎలక్ట్రిక్గ వాహనాల వినియోగం భారత్ లో ప్రారంభ దశలోనే ఉంది. గత సంవత్సరం కేవలం 5,000 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడయ్యాయి . సగటు వినియోగదారునికి ఈ వాహనాలు చాలా ఖరీదైనవి. ఇంకా ముఖ్యమైనది ఏమిటంటే..ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు లేవు. గత సంవత్సరం భారతదేశంలో విక్రయించిన 2.4 మిలియన్ కార్లలో, 5,000 మాత్రమే ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడుపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది.

భారతదేశంలో స్థానికంగా ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిని ప్రారంభించడానికి టెస్లా సిద్ధంగా ఉంటే, భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేయడానికి భారత ప్రభుత్వం కంపెనీని ప్రోత్సహించగలదని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ మార్చిలో చెప్పారు.

Also Read: Reliance Industries: ముఖేష్ అంబానీ పాలిట శనిలా మారిన కరోనా మహమ్మారి..భారీగా తగ్గిన రిలయన్స్ లాభాలు!

Economic Liberalization: మన్మోహన్ ఆర్ధిక సరళీకరణకు మూడు దశాబ్దాలు.. అప్పటికీ ఇప్పటికీ వచ్చిన మార్పులేమిటి?