Investment avenues: సంపద పోగుచేయాలంటే వీటిలో ఇన్వెస్ట్ చేయాల్సిందే.. ఏ రంగం ది బెస్ట్ అంటే..?

విశ్రాంత జీవితం ప్రశాంతంగా గడపటానికి, భవిష్యత్తు అవసరాలకు ప్రతి ఒక్కరికీ డబ్బు చాలా అవసరం. అప్పుడే ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవితం సాఫీగా సాగుతుంది. దాని కోసం ఉద్యోగంలో ఉండగానే వివిధ మార్గాల్లో పెట్టుబడి పెట్టడం చాాలా అవసరం. దేశంలో చాలామంది బ్యాంకుల్లోని వివిధ పథకాలలో డబ్బులను పెట్టుబడి పెడతారు. అయితే వాటి నుంచి వచ్చే ఆదాయం భవిష్యత్తు అవసరాలకు సరిపోకపోవచ్చు. దీంతో సంపదను పెంచుకునేందుకు ప్రస్తుతం స్టాక్స్, బంగారం, రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసేవారు ఎక్కువయ్యారు. అయితే ఈ మూడింటిలో ఏది మంచిది, దేని నుంచి ఆదాయం ఎక్కువగా వస్తుందో ఇప్పడు తెలుసుకుందాం.

Investment avenues: సంపద పోగుచేయాలంటే వీటిలో ఇన్వెస్ట్ చేయాల్సిందే.. ఏ రంగం ది బెస్ట్ అంటే..?
Investments

Updated on: Feb 27, 2025 | 3:45 PM

ఎక్కువ మంది రియల్ ఎస్టేట్ రంగంలో డబ్బులను ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల బడ్జెట్ లో పన్ను మినహాయింపును రూ.12 లక్షలకు పెంచడం వల్ల ఈ రంగానికి ఆదరణ లభిస్తుందని భావిస్తున్నారు. తక్కువ వడ్డీకి హౌసింగ్ రుణాలు అందుబాటులో ఉండడం మరో కలిసి వచ్చే అంశం. భూమి ధరలు ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయి. అలాగే అద్దెలు కూడా ఏడాదికేడాది ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా పట్టణాల్లో జనాభా విపరీతంగా పెరుగుతుండడంతో ఇళ్లకు, స్థలాలకు డిమాండ్ ఏర్పడుతుంది. ఢిల్లీ ఎన్సీఆర్, బెంగళూరు, ముంబై నగరాలలో ఆస్తి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అయితే ఆస్తిని కొనుగోలు చేసే ముందు ఆ ప్రాంతానికి ఉండే డిమాండ్, అక్కడి వసతులు, వివిధ ప్రాంతాలతో ఉండే కనెక్టివీటిని పరిగణనలోకి తీసుకుకోవాలి. చుట్టుపక్కల గ్రామాలకు, ఏరియాలకు ప్రధాన కూడలిగా ఉంటే నిరభ్యంతరంగా కొనుగోలు చేయవచ్చు.

బంగారం

ప్రపంచ వ్యాప్తంగా బంగారానికి ఎంతో డిమాండ్ ఉంది. ప్రపంచంలో నెలకొన్న యుద్దాలు, అనిశ్చిత నేపథ్యంలో అందరూ దీని కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. మన దేశంలో బంగారానికి ఉన్న ప్రాధాన్యం తెలిసిందే. 2014లో రూ.28 వేలు ఉండే పది గ్రాముల బంగారం 2024 నాటికి సుమారు రూ.78 వేలకు పెరిగింది. అంటే పదేళ్లలో మూడు రెట్లు పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు భారీగా బంగారాన్ని కొనుగోలు చేయడం దీనికి కారణమని చెప్పవచ్చు. ఇలా బంగారం నిల్వలలో చైనా (316 టన్నులు), టర్కీ (198 టన్నులు), భారత్ (95 టన్నులు) అగ్రగామిగా ఉన్నాయి. బంగారానికి డిమాండ్ పెరగడానికి ప్రధానం కారణం వివిధ దేశాలు భారీగా కొనుగోలు చేయడమే. అది ఇది ఎప్పుడూ కొనసాగదు. బంగారంపై దీర్ఘకాలిక రాబడి నిరాడంబరంగా ఉంటుంది. అటువంటిది ఇప్పడు ఏడాదికి 5 నుంచి 6 శాతానికి మించిపోయింది.

స్టాక్స్

స్టాక్స్ లో పెట్టుబడి పెట్టడానికి గతంలో ప్రజలు ఆసక్తి చూసేవారు కాదు. కానీ ఇప్పుడు విపరీతంగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీర్ఘకాలంలో అత్యధిక రాబడి సంపాదించడానికి స్టాక్స్ ఎంతో ఉపయోగపడతాయి. అయితే మార్కెట్ ఒడిదొడుకులకు లోబడి రాబడి ఉంటుంది. కోవిడ్ తర్వాత గతేడాది సెప్టెంబర్ లో స్టాక్స్ గరిష్ట స్థాయికి చేరాయి. సెన్సె క్స్ 85.978.25, నిఫ్టీ 26,277.35 పాయింట్లకు చేరింది. అయితే 2024 సెప్టెంబర్ నుంచి 14.4 శాతం క్షీణతను చవిచూశాయి. ముఖ్యంగా ఈక్విటీలు అత్యధిక దీర్థకాలిక రాబడిని అందిస్తాయి. ఉదాహరణకు 2014లో స్టాక్స్ లో రూ.10 వేల పెట్టుబడి పెడితే. 2024 నాటికి రూ.23,600కి చేరింది. కాబట్టి దీర్ఘకాలంలో అత్యధిక రాబడి పొందాలనుకునే వారికి స్టాక్స్ మంచి ఎంపిక. అయితే వాటిపై అవగాహన పెంచుకోవడం చాలా అవసరం.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి