Aadhaar Card Free Update: గుడ్‌న్యూస్‌.. ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌ కోసం గడువు పొడిగింపు

|

Sep 08, 2023 | 3:23 PM

సెప్టెంబరు 6న యూఐడీఏఐ మెమోరాండం జారీ చేసింది. నివాసితుల నుంచి మంచి స్పందన రావడంతో ఆధార్‌ను ఉచితంగా అప్‌డేట్ చేసుకునే తేదీని మరో మూడు నెలలు పొడిగించాలని నిర్ణయించినట్లు యూఐడీఏఐ తెలిపింది. ఇప్పుడు 15 సెప్టెంబర్ నుంచి డిసెంబర్ 14 వరకు myAadhaar పోర్టల్ ద్వారా ఆధార్‌ను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు..

Aadhaar Card Free Update: గుడ్‌న్యూస్‌.. ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌ కోసం గడువు పొడిగింపు
Aadhaar
Follow us on

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఆధార్‌ను ఉచితంగా అప్‌డేట్ చేయడానికి చివరి తేదీని మూడు నెలల పాటు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మరో మూడు నెలల పాటు ఆధార్‌ను అప్‌డేట్ చేయడానికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు చివరి తేదీ 14 సెప్టెంబర్ 2023 ఉండేది. ఇప్పుడు పొడిగింపు నిర్ణయం తర్వాత 14 డిసెంబర్ 2023 వరకు ఉంది.

కాగా, సెప్టెంబరు 6న యూఐడీఏఐ మెమోరాండం జారీ చేసింది. నివాసితుల నుంచి మంచి స్పందన రావడంతో ఆధార్‌ను ఉచితంగా అప్‌డేట్ చేసుకునే తేదీని మరో మూడు నెలలు పొడిగించాలని నిర్ణయించినట్లు యూఐడీఏఐ తెలిపింది. ఇప్పుడు 15 సెప్టెంబర్ నుంచి డిసెంబర్ 14 వరకు myAadhaar పోర్టల్ ద్వారా ఆధార్‌ను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు.

10 ఏళ్ల ఆధార్‌ను అప్‌డేట్ చేసుకోండి:

మీ వద్ద కూడా 10 ఏళ్ల ఆధార్ కార్డు ఉంటే మీ ఆధార్‌ను అప్‌డేట్ చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డ్‌ని అప్‌డేట్ చేయడానికి, మీరు వెబ్ సైట్ కి వెళ్లవచ్చు . డిసెంబరు 14 వరకు ఆధార్‌ను అప్‌డేట్ చేయడానికి ఎలాంటి ఛార్జీ చెల్లించాల్సిన అవసరం లేదు.

ఇవి కూడా చదవండి

ఆధార్ కేంద్రం నుంచి అప్ డేట్ చేసుకుంటే రూ.25 చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. పోర్టల్‌లో ఆధార్‌ను అప్‌డేట్ చేయడానికి, గుర్తింపు కార్డు, చిరునామా రుజువు పత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డ్‌ని ఎలా అప్‌డేట్ చేయాలి..?

  • ముందుగా myaadhaar.uidai.gov.in కి వెళ్లండి.
  • మీ ఆధార్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయాలి. తర్వాత మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు ఓటిపీ వస్తుంది. దానిని ఎంటర్‌ చేయాలి.
  • అక్కడ ఈ పోర్టల్‌కి లాగిన్ చేసి, ‘పేరు/లింగం/పుట్టిన తేదీ, చిరునామాను అప్‌డేట్‌ చేసుకునే ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి.
  • దీని తర్వాత మీరు ‘ఆధార్ ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయి’పై క్లిక్ చేయాలి.
  • జనాభా ఎంపికల జాబితా నుండి ‘చిరునామా’ను ఎంచుకుని, ‘ఆధార్‌ను నవీకరించడానికి కొనసాగండి’పై క్లిక్ చేయండి.
  • స్కాన్ చేసిన కాపీని అప్‌లోడ్ చేసి, అవసరమైన జనాభా సమాచారాన్ని నమోదు చేయండి.
  • SRN సంఖ్య జనరేట్‌ అవుతుంది. దానిని ట్రాకింగ్ కోసం ఉంచండి.
  • ధృవీకరణ తర్వాత, మీ ఆధార్ అప్‌డేట్ చేయబడుతుంది. అలాగే మీరు మొబైల్‌ నంబర్‌కు SMS వస్తుంది.

ఏ సమస్య ఉన్నా కాల్ చేయండి:

మీ ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ లేదా అప్‌డేట్ స్థితి, PVC కార్డ్ స్థితి గురించి ఏదైనా సమాచారం కోసం లేదా SMS ద్వారా సమాచారాన్ని పొందడానికి, నివాసితులు యూఐడీఏఐ టోల్-ఫ్రీ నంబర్, 1947, 24కు కాల్ చేయవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి