ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే షిమ్లాలో ఉన్నట్టే..

తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఎండలు దంచికొడుతున్నాయ్. మండే మాడును చల్లబరిచేందుకు జనాలు ఏసీలు, కూలర్లను ఆశ్రయిస్తున్నారు. అయితే ఇవి కొనాలంటే సామాన్యులకు పెద్ద ఖర్చుతో కూడుకున్న పని. మరి వారికి బడ్జెట్‌లో ఇల్లంతటికి కూలింగ్ నింపేందుకు ఓ స్టాండింగ్ ఫ్యాన్‌ చాలు.

ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే షిమ్లాలో ఉన్నట్టే..
Sprinkler Fans

Updated on: Apr 26, 2024 | 6:51 AM

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు పడుతున్నప్పటికీ.. ఏమాత్రం ఉక్కపోత, ఎండవేడి తగ్గలేదు. భానుడి భగభగలు ఎక్కువవుతుండటంతో జనాలు అల్లాడిపోతున్నారు. మాడుపగిలే ఎండలకు ఫ్యాన్ గాలి సరిపోవట్లేదు. చల్లదనం కోసం కూలర్లు, ఏసీలవైపు మొగ్గు చూపుతున్నారు. సాధారణంగా ఈ సీజన్‌లో ఏసీలు, కూలర్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఇక గోడ ఏసీల విషయానికొస్తే రూ. 25 నుంచి 30 వేలపైమాటే. ఇలాంటి తరుణంలో వీటి కొనుగోలు మిడిల్ క్లాస్ వ్యక్తులకు ఖర్చుతో కూడుకున్న పని. మరి వాళ్ల కోసమే మార్కెట్‌లోకి పోర్టబుల్ ఏసీలు, మినీ ఏసీలు వచ్చేశాయి. ఈ క్రమంలోనే వారి బడ్జెట్‌లో వచ్చే ఓ కూలింగ్ స్టాండ్ ఫ్యాన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇల్లంతటిని చల్లబరిచేందుకు ఇదొక్కటి చాలు.. క్షణాల్లో మీ చుట్టుపక్కల షిమ్లాలాంటి చల్లదనాన్ని ఇస్తుంది. మరి దీని ఫీచర్లు చూసేద్దామా..

ప్రముఖ ఆన్‌లైన్ ఈ కామర్స్ వెబ్‌సైట్లు అయిన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి వాటిల్లో వీటి అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వాటర్ స్ప్రింక్లర్ ఫ్యాన్ల ధర తక్కువ. ఈ ఫ్యాన్ సెటప్ అంతటిని రూ. 1500కి కొనేయొచ్చు. ఒకవేళ మనం స్ప్రింక్లర్ పైపులు, వాటర్ పంప్ సెటప్‌లను కొంటే మాములు స్టాండ్ ఫ్యాన్లను సైతం స్ప్రింక్లర్ ఫ్యాన్లు మాదిరిగా మార్చుకోవచ్చు. వాటర్ పంప్ సెట్‌లోకి బకెట్ నీటిని నింపితే.. అవి స్ప్రింక్లర్ పైప్ ద్వారా లోపలికి వెళ్తాయి. తద్వారా ఫ్యాన్ రెక్కల నుంచి చల్లని గాలి వీస్తుంది. క్షణాల్లో మీ చుట్టుప్రక్కల మంచు కురుస్తుంది. మరి లేట్ ఎందుకు దీని సెటప్‌పై ఓ లుక్కేయండి. (Source)