ఎండలు మండిపోతున్నాయ్. తెల్లవారిందంటే చాలు.. భానుడు భగభగలు మొదలైపోతున్నాయి. వేడి, ఉక్కపోతతో జనాలు అల్లాడిపోతున్నారు. సాధారణంగా ఎండాకాలంలో అందరూ కూడా ఇంటికి ఓ ఏసీ పెట్టించుకోవాలని చూస్తుంటారు. అయితే గోడ ఏసీ పెట్టించుకోవాలంటే.. ఖర్చు భారీగా అవ్వడమే కాదు.. అద్దె ఇల్లు అయితే మనం ఓనర్లతో మాట్లాడాల్సి వస్తుంది కూడా. సహజంగానే ఈ సీజన్‌లో కూలర్లు, ఏసీలకు భారీ డిమాండ్ ఉంటుంది. మరి అలాంటప్పుడు మీరు మీ బడ్జెట్‌లో ఓ ఏసీ కొనాలంటే.. ఠక్కున పోర్టబుల్ ఏసీకి కన్వర్ట్ అయిపోండి. అదే బెటర్ ఆప్షన్. ఈ పోర్టబుల్ ఏసీలను మనంతో పాటు ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ఇంట్లో ఎక్కడైనా పెట్టొచ్చు. దీంతో ఇల్లంతటితో క్షణాల్లో చల్లబరుచుకోవచ్చు. మరి లేట్ ఎందుకు మీకోసం ఎంపిక చేసిన ఓ పోర్టబుల్ ఏసీపై లుక్కేసేద్దాం.
ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో ఈ పోర్టబుల్ ఏసీ అందుబాటులో ఉంది. దీని ధర రూ. 5,484 కాగా.. ఇందుకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. మీరు ప్రతీ నెలా రూ.266 కడితే చాలు.. ఈ పోర్టబుల్ ఏసీని ఇంటికి తెచ్చుకోవచ్చు. త్రీ స్పీడ్‌లో అడ్జెస్ట్ చేసే కూలింగ్ ఫ్యాన్ అమర్చబడిన ఈ పోర్టబుల్ ఏసీని ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లవచ్చు. చాలా లైట్ వెయిట్. దీనిలోని బ్యాటరీని టైప్-సీ క్యాబుల్ ద్వారా ఛార్జ్ చేసుకోవచ్చు. ట్రాన్స్‌పెరెంట్ ట్యాంక్, రిప్లేసబుల్ ఐస్ బాక్స్ ఇందులో ఉన్నాయి. ఈ పోర్టబుల్ ఏసీలోని ట్యాంక్‌లో గరిష్టంగా 730 మిల్లీలీటర్ల వాటర్ నింపవచ్చు. అలాగే ఈ పోర్టబుల్ ఏసీలో మల్టీకలర్ నైట్ లైట్ ఉంది.(Source)
ఇది చదవండి: రూ. 500కే గ్యాస్ సిలిండర్.. తొలుత పూర్తి ధర చెల్లించాల్సిందే.. పూర్తి వివరాలు..