
ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. ముఖ్యంగా అమెరికా, చైనా తర్వాత ఈవీ వాహనాల మార్కెట్‌లో భారతదేశంలో తదుపరి స్థానంలో ఉంది. ఇటీవల కాలంలో పెట్రోల్ ధరలు కూడా విపరీతంగా పెరగడంతో పెట్రో ధరల నుంచి రక్షణకు మొదట్లో ప్రజల ఈవీ వాహనాలు వాడేవారు. అయితే ఈవీ వాహనాలను మొదట్లో పట్టణ ప్రాంతాల ప్రజలే ఎక్కువగా ఈవీ వాహనాలను వాడే వారు. కానీ క్రమేపి గ్రామీణ ప్రాంతాల వారు కూడా ఈవీ వాహనాల వాడకానికి అలవాటు పడ్డారు. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా టాప్ కంపెనీల నుంచి స్టార్టప్ కంపెనీల వరకూ కొత్తకొత్త మోడల్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేస్తున్నాయి. మార్కెట్‌లో పెరిగిన అనూహ్య లభ్యత మేరకు అన్ని కంపెనీలు స్పెషల్ ఆఫర్లతో వినియోగదారులకు ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా టీవీఎస్ కంపెనీ కూడా తన ఈవీ స్కూటర్ అయిన ఐ క్యూబ్‌పై ఆకర్షణీయ ఆఫర్లను ప్రకటించింది.
టీవీఎస్ మోటార్స్ కంపెనీ ఐక్యూబ్ పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లో అందిస్తోంది. ఇందులో సూపర్ ఫీచర్లు ఉన్నాయి. ఈ కంపెనీ ఐక్యూబ్, ఐక్యూబ్ ఎస్, ఐక్యూబ్‌ఎస్‌టీ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ స్కూటర్ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 100 నుంచి 145 కిలోమీటర్లు మైలేజ్ అందిస్తుంది. అంటే దాదాపు రూ. 18 ఖర్చుతో 145 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. అలాగే స్మార్ట్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్, డీఆర్‌ఎల్, ఫాస్ట్ ఛార్జింగ్, హెచ్‌ఎంఐ కంట్రోల్, 32 లీటర్ స్టోరేజ్, 7 అంగుళాల మల్టీ-ఫంక్షనల్ టచ్ స్క్రీన్ డాష్ బోర్డ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. టీవీఎస్ స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అనే ఫీచర్ కూడా ఉంది. ఇది మీ స్కూటర్‌ని ఫోన్‌తో కనెక్ట్ చేయడానికి అనుమతిస్తుంది. వెహికల్ స్టాటిస్టిక్స్, లైవ్ ట్రాకింగ్, క్రాష్ అలర్ట్, లాస్ట్ పార్క్ చేసిన లొకేషన్, ఫెన్స్, థెఫ్ట్ అలర్ట్ వంటి జియో ఫీచర్లు ఈ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి.
ఈ స్కూటర్ అసలైన ధర రూ. 1.81 లక్షలుగా ఉంది. ఇందులో భారత ప్రభుత్వం ఇచ్చే ఫేమ్ 2 సబ్సిడీ కింద రూ. 21 వేల తగ్గింపు పొందవచ్చు. ఆన్-రోడ్ ధర రూ. 1.61 లక్షలు ఉంటుంది. అలాగే ఈ స్కూటర్ కొనుగోలుపై 95 శాతం వరకు ఫైనాన్స్ పొందవచ్చు. నెలవారీ ఈఎంఐ రూ. 2,999 నుంచి ప్రారంభమవుతుంది. ఈఎంఐ మొత్తం కూడా పదవీకాలం ఆధారంగా మారుతుంది. ఈఎంఐ 60 నెలల పాటు చేయవచ్చు. వడ్డీ రేటుతో పాటు ప్రాసెసింగ్ ఫీజు తక్కువగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై 3 సంవత్సరాల వారెంటీ ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..