డబ్బు సంపాదించాలంటే ఉన్నత చదువులు చదవాల్సిన అవసరం లేదు. తెలివితేటలు ఉంటే సరిపోతుంది. ఈ మధ్య కాలంలో చాలామంది ఉద్యోగాలు చేసి సంపాదించడం కంటే వ్యాపారం చేయడం మేలనుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలు వివాహం తర్వాత ఉద్యోగం చేసే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఇల్లు, పిల్లలు వీటికే సమయం సరిపోతుంది. కొన్ని సందర్భాల్లో తమ ఆరోగ్యంపై శ్రద్ధ చూపలేనంత బిజీగా మారుతారు. ఉద్యోగం చేయాలన్న కోరిక ఉన్నప్పటికీ పరిస్థితుల ప్రభావం వల్ల ఇంటికే పరిమితం అవుతున్నారు. అయితే ఈ మధ్య చాలా మంది మహిళలు ఇంట్లోనే ఉంటూ లక్షలు సంపాదిస్తున్నారు. అవును ఇంటి పని తర్వాత కాస్త విరామం తీసుకుని సంపాదనపై ద్రుష్టి పెడుతున్నారు.
చాలామంది మహిళలు డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. ఖాళీ సమయంలో కాస్త సమయం కేటాయిస్తే చాలు నెలకు కనీసం రూ. 50వేల వరకు సంపాదించే ఓ చక్కటి వ్యాపార ప్రణాళిక గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంటి వద్దే ఉంటూ కాస్త సమయం కేటాయిస్తే చాలు. మీరు మీరు కూడా మీ భాగస్వామితో సమానంగా ఆదాయం పొందవచ్చు. దీని కోసం ఏం చేయాలో తెలుసుకుందాం.
ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం చాలా మంది బ్యాచిలర్స్ నగరాలు, పట్టణాల్లో నివసిస్తున్నారు. వీరికి మధ్యాహ్నం వేళ భోజనం చేయడం అనేది ఒక పెద్ద సమస్య. ముఖ్యంగా హోటల్స్, రెస్టారెంట్స్, మెస్సుల్లో భోజనం చేస్తే చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దీనికి చక్కటి పరిష్కారం మొబైల్ ఫుడ్ స్టాల్. ఈ మధ్యకాలంలో ఆఫీసులు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఈ మొబైల్ ఫుడ్ స్టాల్స్ వెలుస్తున్నాయి. వీటిలో మధ్యాహ్న భోజనానికి సరిపడా ఆహారాన్ని వెంట తీసుకువస్తారు. తక్కువ ధరకే భోజనం అందిస్తారు. దీన్ని మీరు కూడా వ్యాపార అవకాశంగా మార్చుకోవచ్చు.
ఇంట్లోనే ఉంటూ మహిళలు ప్రతిరోజూ కొంత సమయం కేటాయిస్తే చాలు. కనీసం 20 నుంచి 30 మందికి భోజనం తయారు చేయాలి. ఈ మొబైల్ ఫుడ్ స్టాల్ ద్వారా ఏర్పాటు చేసినట్లయితే…మీకు మంచి ఆదాయం లభిస్తుంది. ఈ మొబైల్ ఫుడ్ స్టాల్ కోసం మీరు స్థానికంగా పర్మిషన్ తీసుకోవాలి. స్ట్రీల్ పుడ్ తరహా విక్రయించినట్లయితే..ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కగా సంపాదించుకోవచ్చు.
ఈ మొబైల్ ఫుడ్ కోర్ట్ ద్వారా మీరు ప్రతిరోజూ ఆదాయం పొందవచ్చు. ముందుగా మీ డిమాండ్ ను బట్టి ఆహారాన్ని తయారు చేయాలి. అలా అయితే ఫుడ్ వేస్టేజ్ అనేది ఉండదు. లేదంటే ఆహారం వ్రుదా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ధరలను అందుబాటులో ఉంచాలి. మార్జిన్ తగ్గించుకుంటే…కస్టమర్లు ఎక్కువగా వస్తుంటారు. మధ్యాహ్నం భోజనంలో అన్నం, పప్పు, కూర, సాంబారు, పెరుగు, రోటి పచ్చడి…అప్పుడప్పుడు నాన్ వెజ్ కూడా అందుబాటులో ఉంచాలి. ఈ వ్యాపారానికి పెట్టుబడి చాలా తక్కువగా ఉంటుంది. కేవలం ఆహారం వండటానికి పాత్రలు కొనుగోలు చేస్తే సరిపోతుంది.
ఇక ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రుచి బాగుంటే కస్టమర్లు వస్తూనే ఉంటారు. ప్రతిరోజూ మెనూ మార్చుతుండాలి. ఒక వేళ మీరు మాంసాహారం కూడా అందుబాటులో ఉంచితే…మరింత ఎక్కువ లాభం పొందేవీలుంటుంది. చికెన్ బిర్యానీ తినేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. అయితే దీన్ని డిమాండ్ ను బట్టి తయారు చేసుకుని పెట్టాలి. క్వాలిటీ విషయంలో అస్సలు రాజీ పడకూడదు సుమా. కస్టమర్లు సలహాలను ఫీడ్ బ్యాక్ ఆధారంగా మీరు వంటలు వండితే మంచి లాభం ఉంటుంది. బాయిల్డ్ ఎగ్స్, ఎగ్ ఆమ్లెట్ అదనం వేసి ఛార్జ్ చేస్తే మీకు మరింత లాభంగా ఉంటుంది. ఈ బిజినెస్ చేస్తున్నవారు కనీసం నెలకు రూ. 40 వేల నుంచి రూ. 50 వేల వరకు సంపాదిస్తున్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తక్కువ పెట్టుబడితో ప్రారంభించి చూడండి. ఒకవేళ నష్టపోయిన ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి