Credit Card: ఆన్‌లైన్ షాపింగ్ కోసం క్రెడిట్ కార్డ్ తీసుకోవాలనుకుంటున్నారా.. ఈ నాలుగు విషయాలను గుర్తించుకోండి

|

May 19, 2022 | 11:33 AM

Credit Card: క్రెడిట్ కార్డ్ తీసుకునే ముందు, మీరు ప్రయాణం కోసం ఆన్‌లైన్‌ (Online)లో ఎక్కువ బుకింగ్ చేస్తే అందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. ఉదాహరణకు పెట్రోల్, డీజిల్ చెల్లింపునకు లింక్ ..

Credit Card: ఆన్‌లైన్ షాపింగ్ కోసం క్రెడిట్ కార్డ్ తీసుకోవాలనుకుంటున్నారా.. ఈ నాలుగు విషయాలను గుర్తించుకోండి
Follow us on

Credit Card: క్రెడిట్ కార్డ్ తీసుకునే ముందు, మీరు ప్రయాణం కోసం ఆన్‌లైన్‌ (Online)లో ఎక్కువ బుకింగ్ చేస్తే అందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. ఉదాహరణకు పెట్రోల్, డీజిల్ చెల్లింపునకు లింక్ చేయబడిన అనేక కార్డులు ఉన్నాయి. మీ ఇంధన ఖర్చులు ఎక్కువగా ఉంటే, అటువంటి క్రెడిట్ కార్డుల ద్వారా మీరు ఎక్కువ రాబడిని పొందవచ్చు.

వడ్డీ రేటు

క్రెడిట్ కార్డ్‌ని ఎంచుకునే ముందు ఆ కార్డుపై వడ్డీ రేటు ఏమిటో తెలుసుకోండి. కొన్నిసార్లు మీరు బిల్లుపై కనీస మొత్తాన్ని చెల్లిస్తారు. ఈ సందర్భంలో మిగిలిన మొత్తంపై వడ్డీ వసూలు చేయబడుతుంది. మరోవైపు మీరు మొత్తాన్ని EMIగా మార్చినట్లయితే, EMIపై వడ్డీని చెల్లించాలి. అటువంటి పరిస్థితిలో మీరు మీ తక్కువ వడ్డీ రేటును అందించే క్రెడిట్ కార్డ్‌ని ఎంచుకోవాలి. దీనితో పాటు, చెల్లింపుతో పాటు వడ్డీ లేని సమయం గురించి సమాచారాన్ని కూడా తెలుసుకోండి. అధిక పరిమితి ఉన్న కార్డును ఎంచుకోండి.

ఇవి కూడా చదవండి

రివార్డు పాయింట్లు:

క్రెడిట్ కార్డ్ ఎంపికలో కార్డ్‌లోని రివార్డులు చాలా ముఖ్యమైనవి. ప్రతి బ్యాంకు తన క్రెడిట్ కార్డ్‌పై వివిధ మార్గాల్లో రివార్డ్ పాయింట్లను అందిస్తుంటుంది. మీరు అనేక ఇతర డీల్‌ల కోసం దీనిని ఉపయోగించవచ్చు. క్రెడిట్ కార్డ్‌ని ఎంచుకునే సమయంలో క్రెడిట్ కార్డ్‌లో ఎన్ని రివార్డ్‌లు అందుబాటులో ఉన్నాయి.. మీరు ఈ కార్డ్ రివార్డ్ పాయింట్‌లను ఎక్కడ, ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకోండి.

ఇతర సేవలు

క్రెడిట్ కార్డుల ద్వారా వినియోగదారులు అంతర్జాతీయ షాపింగ్, EMI సౌకర్యం మొదలైన అనేక సేవలను పొందుతారు. దీని సహాయంతో కస్టమర్ షాపింగ్ పరిధి పెరుగుతుంది. పెద్ద కొనుగోళ్లు చేయడమే కాకుండా అంతర్జాతీయ సైట్ల నుండి కూడా కొనుగోలు చేయవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి