Postal Scheme: ఈ పోస్టాఫ్టీస్‌ పథకంలో చేరితే.. నెలకు ఐదువేలు మీ చేతికి పక్కా..

|

Dec 21, 2022 | 9:18 PM

భవిష్యత్తు ఆర్థిక అవసరాల కోసం పొదుపు అనేది జీవితంలో ఎంతో ముఖ్యం. ప్రధానంగా సేవింగ్స్‌ కోసం పేద, మధ్య తరగతి ప్రజలు ఎక్కువుగా పోస్టల్‌ స్కీమ్స్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తారు. కేంద్రప్రభుత్వ రంగ సంస్థ కావడంతో తాము దాచుకున్న డబ్బులకు..

Postal Scheme: ఈ పోస్టాఫ్టీస్‌ పథకంలో చేరితే.. నెలకు ఐదువేలు మీ చేతికి పక్కా..
Post Office Scheme
Follow us on

భవిష్యత్తు ఆర్థిక అవసరాల కోసం పొదుపు అనేది జీవితంలో ఎంతో ముఖ్యం. ప్రధానంగా సేవింగ్స్‌ కోసం పేద, మధ్య తరగతి ప్రజలు ఎక్కువుగా పోస్టల్‌ స్కీమ్స్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తారు. కేంద్రప్రభుత్వ రంగ సంస్థ కావడంతో తాము దాచుకున్న డబ్బులకు భద్రత ఉంటుందనే కారణంగా ఎక్కువ మంది పోస్టాఫీసు పథకాల్లో పెట్టుబడులు పెడుతుంటారు. ఉద్యోగం చేస్తున్న సమయంలో పొదుపు చేయడం ద్వారా.. రిటైర్మెంట్ వయసు వచ్చిన తర్వాత.. నెలకు నిర్ణీత మొత్తంలో నగదు వచ్చే పథకాల కోసం చాలా మంది చూస్తుంటారు. అలాంటివారికి ఉత్తమమైన పథకం పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ ఒకటి. నెలనెలా మీకు నిర్ణీత మొత్తంలో ఆదాయం రావాలంటే ఎస్‌ఐపి ద్వారా పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో నిర్ధేశించిన కాలపరిమితి తర్వాత నెలవారీ ఆదాయ పథకం (పీవోఎమ్‌ఐఎస్‌) అవకాశాన్ని పొందే సౌలభ్యం ఉంటుంది. ఈ పథకంలో ఒకే మొత్తంలో పెట్టుబడి పెట్టవచ్చు.

ఈ పథకంలో డబ్బును డిపాజిట్‌ చేసిన ఐదేళ్ల తర్వాత తిరిగి పొందుతారు. పీవోఎమ్‌ఐఎస్‌ పథకంలో సింగిల్, జాయింట్‌ ఖాతాలను తెరిచే వెసులుబాటు ఉంది. రిటైర్మెంట్‌ తర్వాత పెన్షన్‌ కోసం చాలా మంది ఈ పథకాన్ని ఎంచుకుంటారు. పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌లో ఒకే ఖాతా ద్వారా గరిష్టంగా రూ.4.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఉమ్మడి ఖాతాలో అయితే గరిష్టంగా రూ.9 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు.

పీవోఎమ్‌ఐఎస్‌ పథకంలో సంవత్సరానికి 6.6 శాతం వడ్డీ రేటు అందిస్తున్నారు. ఈ పథకంలో రూ.9 లక్షలు డిపాజిట్ చేస్తే 6.6 శాతం చొప్పున ఏడాదికి మొత్తం వడ్డీ రూ.59,400 వస్తుంది. ఈ మొత్తాన్ని 12 నెలల పాటు నెలనెలా ఇస్తారు. ఈ విధంగా ప్రతి నెల వడ్డీ దాదాపు రూ.5వేలు అందిస్తారు. అదే జాయింట్ ఖాతా కాకుండా సింగిల్‌ అకౌంట్‌ అయితే మాత్రం నెలవారీ వడ్డీ రూ.2,475 అవుతుంది. ఈ పథకంలో చేరాలంటే పోస్టాఫీసులో సేవింగ్ అకౌంట్‌ తెరవాలి. ఆధార్‌ కార్డు, పాస్‌ పోర్ట్, ఓటరు కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌లలో ఏదో ఒకటి ఉండాలి. వీటితో పాటు.. రెండు పాస్‌పోర్టు సైజ్ ఫోటోలు, చిరునామా ధృవీకరణ పత్రం ఉండాలి. ఈ ఖాతాకు సంబంధించిన ధరఖాస్తును ఆన్‌లైన్‌ లో పోస్టాఫీసు అధికారిక వెబ్‌ సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ ఖాతా తెరవడానికి రూ.వెయ్యి రూపాయలు మొదట డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. పొదుపు ఖాతా తెరిచిన తర్వాత పోస్టల్‌ పథకాల్లో ఇన్వెస్ట్‌మెంట్‌ చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం చూడండి..