Multibagger Stocks: ఏడాదిలో ధనవంతులను చేసిన 10 మల్టీబ్యాగర్ స్టాక్స్.. పెట్టుబడిని 6 రెట్లు పెంచేశాయి
ఒక సంవత్సరంలో చాలా స్టాక్స్ పెట్టుబడిదారులకు అధిక రాబడిని అందించాయి. కొన్ని స్టాక్స్ 500 శాతానికి పైగా రాబడులను అందించి ధనవంతులుగా మర్చాశాయి.

Multibagger Stocks: గతేడాది కాలంలో మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చే స్టాక్‌ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. వాస్తవానికి స్టాక్ మార్కెట్ గతేడాది చాలా వృద్ధిని సాధించింది. అయితే అన్నింటికన్నా ఎక్కువగా లాభాలను అందించిన 10 స్టాక్‌ల వివరాలను అందించాం. ఇవి పెట్టుబడిదారుల డబ్బును ఓ ఏడాదిలో 6 రెట్లు పెంచి, ధనవంతులుగా మార్చేశాయి. అయితే మల్టీ బ్యాగర్స్‌ను ఎంచుకోవడం చాలా కష్టం. మీకోసం గడేదాది కాలంలో అద్భుతంగా ఫలితాలు చూపించిన స్టాక్స్‌ను ఇక్కడ అందించాం.
అదానీ టోటల్ గ్యాస్ (Adani Total Gas) ఈ స్టాక్ సంవత్సరంలో 634 శాతం రాబడిని అందించింది. ఈ స్టాక్ చివరి ముగింపు ధర రూ .1452గా ఉంది.
జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ (JSW Energy) ఈ స్టాక్ ఏడాది కాలంలో 527 శాతం రాబడిని అందించింది. ఈ స్టాక్ చివరి ముగింపు ధర రూ .395 గా నమోదైంది.
అదానీ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్ (Adani Transmission Limited) ఈ స్టాక్ సంవత్సరంలో 475 శాతం రాబడిని ఇచ్చింది. ఈ స్టాక్ చివరి ముగింపు ధర రూ .1687గా ఉంది.
బాలాజీ అమీన్స్ లిమిటెడ్ (Balaji Amines Limited) ఈ స్టాక్ గతేడాది కాలంలో 431 శాతం రాబడిని అందించింది. ఈ స్టాక్ చివరి ముగింపు ధర రూ .4,70 గా నమోదైంది.
అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (Adani Enterprises Limited) ఈ స్టాక్ గత ఏడాదిలో 397 శాతం రాబడిని ఇచ్చింది. ఈ స్టాక్ చివరి ముగింపు ధర రూ .135గా నమోదైంది.
ట్రైడెంట్ లిమిటెడ్ (Trident Limited) గత ఏడాది కాలంలో ఈ స్టాక్ 394 శాతం రిటర్న్ ఇచ్చింది. ఈ స్టాక్ చివరి ముగింపు ధర రూ. 45 గా నమోదైంది.
హెచ్‌ఎఫ్‌సీఎల్ (HFCL) గత ఏడాది కాలంలో ఈ స్టాక్ 347 శాతం రాబడిని ఇచ్చింది. ఈ స్టాక్ చివరి ముగింపు ధర రూ .95 గా నమోదైంది.
హ్యాపీయెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్(Happiest Minds Technologies) గత ఏడాది కాలంలో ఈ స్టాక్ 331 శాతం రాబడిని ఇచ్చింది. ఈ స్టాక్ చివరి ముగింపు ధర రూ 1410 గా ఉంది.
గుజరాత్ ఫ్లోరోకెమికల్స్ లిమిటెడ్(Gujarat Fluorochemicals Limited) ఈ స్టాక్ గత ఏడాది కాలంలో 321 శాతం రాబడిని ఇచ్చింది. ఈ స్టాక్ చివరి ముగింపు ధర రూ. 2080 గా నమోదైంది.
ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్(Indian Energy Exchange) గత ఏడాది కాలంలో ఈ స్టాక్ 307 శాతం రాబడిని ఇచ్చింది. ఈ స్టాక్ చివరి ముగింపు ధర రూ. 793 గా ఉంది.
గమనిక: మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం రిస్క్‌కు లోబడి ఉంటుంది. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేముందు నిపుణుడి సలహా తీసుకోవడం చాలా మంచింది. ఇక్కడ పేర్కొన్న సమాచారం మీకు అవగాహన కల్పించేందుకు అందించినదే తప్ప అందులో పెట్టుబడి పెట్టమని చెప్పలేం.
Also Read: Share Market: ఆరంభంలోనే దూకుడు.. ఆల్‌టైమ్ హైక్ దిశగా మార్కెట్లు..