Business Ideas: ఇంట్లోనే ఈ వ్యాపారాలను ప్రారంభిస్తే.. ప్రతీ నెలా రూ. 50 వేల సంపాదన పక్కా.!

చాలీచాలని జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారా.? ఇంట్లోనే ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలని చూస్తున్నారా.? అయితే మీకోసం ఓ బిజినెస్ ఐడియా తీసుకొచ్చేశాం. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడిని సంపాదించవచ్చు. మరి ఆ ఐదు వ్యాపారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.?

Business Ideas: ఇంట్లోనే ఈ వ్యాపారాలను ప్రారంభిస్తే.. ప్రతీ నెలా రూ. 50 వేల సంపాదన పక్కా.!
Money

Updated on: Aug 28, 2023 | 5:13 PM

చాలీచాలని జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారా.? ఇంట్లోనే ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలని చూస్తున్నారా.? అయితే మీకోసం ఓ బిజినెస్ ఐడియా తీసుకొచ్చేశాం. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడిని సంపాదించవచ్చు. కేవలం మీ ఇంటిపై టెర్రస్ ఉంటే చాలు.. ఈ వ్యాపారాలను మొదలెట్టేయొచ్చు. ఎలాంటి నష్టాలు ఉండవు. ప్రతీ నెలా దాదాపుగా రూ. 50 వేల వరకు సంపాదన మీ సొంతం. మరి ఆ వ్యాపారాలు ఏంటి.? దానికి కావాల్సిన సామాగ్రి ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..!

టెర్రస్ అద్దెకు ఇవ్వడం:

ఏదైనా చిన్న కంపెనీకి మీరు మీ టెర్రస్‌ను అద్దెకు ఇవ్వడం ద్వారా మంచి సంపాదన రాబట్టవచ్చు. గ్రామాల నుంచి పట్టణాలు.. అక్కడ నుంచి నగరాల వరకు.. ఇలాంటివి చేస్తూ.. కొందరు వ్యక్తులు భారీ లాభాలు ఆర్జిస్తున్నారు.

టెర్రస్ ఫార్మింగ్:

ఈ పేరు మీరు వినే ఉంటారు. ఈ మధ్యకాలంలో చాలామంది టెర్రస్ ఫార్మింగ్ చేస్తున్నారు. చిన్నగా కూరగాయల మొక్కలను పాలిటిన్ బ్యాగుల్లో వేసి.. పెంచుతున్నారు. టెర్రస్ గార్డెనింగ్ కూడా ఇటీవల బాగా ఫేమస్ అయింది. మీరు మీ ఇంటి టెర్రస్ పైవాటి కోసం వాడుకోవాలని అనుకుంటున్నట్లయితే.. మంచి సూర్యకాంతి వచ్చేలా ప్రత్యేక శ్రద్ధ వహించండి.

సోలార్ ప్లాంట్:

మీ ఇంటి టెర్రస్‌‌పై సోలార్ ప్లాంట్ స్టార్ట్ చేయొచ్చు. దాన్ని ప్రారంభించడం ద్వారా మంచి లాభాలు ఆర్జించవచ్చు. ఈ సోలార్ ప్లాంట్ ఇన్‌స్టాలేషన్‌తో.. మీ విద్యుత్ బిల్లు ఆదా కావడమే కాదు.. డబ్బును కూడా అందిస్తుంది. దీన్ని చిన్న మొత్తంతో ప్రారంభించి.. మంచి రాబడిని ఆర్జించవచ్చు.

మొబైల్ టవర్ ఇన్‌స్టాల్:

దీని కోసం మీకు మున్సిపాలిటీ నుంచి అనుమతి పొందాలి. మీ ఇంటి టెర్రస్‌పై మొబైల్ టవర్ ఇన్‌స్టాల్ చేస్తే.. దానిని ద్వారా డబ్బులు పొందొచ్చు. ఇంటి టెర్రస్‌ను ఏదైనా మొబైల్ కంపెనీకి అద్దెకు ఇచ్చినప్పుడు.. ఆ కంపెనీ మొబైల్ టవర్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత.. మీకు ప్రతీ నెలా కొంత మొత్తంలో డబ్బు ఇస్తుంది.

హోర్డింగ్స్ లేదా బోర్డింగ్స్:

మీ ఇల్లు ఏదైనా మంచి రద్దీ ఏరియాలో నిర్మించబడి ఉన్నట్లయితే.. ఇంటి టెర్రస్‌పై ఏదైనా కంపెనీ హోర్డింగ్స్ లేదా బోర్డింగ్స్‌ను పెట్టించుకుని.. దాని ద్వారా డబ్బులు ఆర్జించవచ్చు. దీని కోసం పలు అనుమతులు కావాల్సి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం..